AP News: ఈ కేడి కపుల్ మాములోళ్లు కాదు.. పైకి సుద్దపూసలే.. కానీ అసలు మ్యాటర్ తెలిస్తే

| Edited By: Ravi Kiran

Jan 03, 2025 | 1:44 PM

వారి మాటలకు టెంప్ట్ అయినా ఆ షాపు యజమాని తన దగ్గర ఉన్న దుస్తులను వాళ్లకు ఇచ్చింది. దాదాపుగా ఒకటి కాదు రెండు కాదు ఎనభై వేల రూపాయల విలువైన వస్త్రాలు మూటగట్టుకున్నారు. బంగారం తీసుకొచ్చి ఇస్తామని చెప్పి వెళ్లారు. వారిద్దరూ వెళ్లాక.. సొరుగు ఓపెన్ చేశారు.

AP News: ఈ కేడి కపుల్ మాములోళ్లు కాదు.. పైకి సుద్దపూసలే.. కానీ అసలు మ్యాటర్ తెలిస్తే
Ap News
Follow us on

అనకాపల్లి జిల్లా అచ్చుతాపురంలో ఉన్న ఓ దుకాణానికి ఓ మహిళ మరో వ్యక్తి వచ్చారు. అక్కడ కొన్ని వస్త్రాలు కొనుగోలు చేశారు.. దుకాణ యజమానితో మాట కలిపారు. తమ దగ్గర బంగారం నాణెం ఇక్కడ ఎవరో తమకు తెలియదని చెప్పారు.. బంగారం నాణేన్ని అమ్మి ఇంట్లో శుభకార్యం కోసం మరిన్ని వస్త్రాలు కొనుగోలు చేయాల్సి ఉందని అన్నారు.. వారి మాటలకు టెంప్ట్ అయినా ఆ షాపు యజమాని తన దగ్గర ఉన్న దుస్తులను వాళ్లకు ఇచ్చింది. దాదాపుగా ఒకటి కాదు రెండు కాదు ఎనభై వేల రూపాయల విలువైన వస్త్రాలు మూటగట్టుకున్నారు. బంగారం తీసుకొచ్చి ఇస్తామని చెప్పి వెళ్లారు. వారిద్దరూ వెళ్లాక.. సొరుగు ఓపెన్ చేశారు. అందులో ఉన్న 2.8 లక్షల నగదు మాయం.. అవాక్కైనా షాపు యజమాని లక్ష్మి.. తల పట్టుకుని పోలీసులను ఆశ్రయించింది. రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేస్తే.. ఆ ఇద్దరూ..!

పోలీసుల విచారణలో కీలక విషయాలను వెలుగులోకి వచ్చాయి. ఎస్పీ తుహిన్ సిన్హా ఆదేశాలతో పరవాడ డిఎస్పీ సచ్చిదానంద ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. ఇటువంటి నేరగాళ్లు ఎక్కడ ఉన్నారని వారిపై ఆరా తీసి వారి ఫోటోలను బాధితురాలికి చూపించారు. గుర్తుపట్టడంతో.. ఇది పల్నాడు జిల్లా సత్తెనపల్లి ముఠాపనిగా గుర్తించారు. దర్యాప్తు చేసే క్రమంలో.. నిందితుల్ ఇద్దరూ మరొకరు నీ మోసం చేసేందుకు సిద్ధమై పోలీసులకు దొరికిపోయారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇద్దరిలో ఒకరు పల్నాడు జిల్లా నరసరావుపేటలోని పెద్దచెరువు ప్రాంతానికి చెందిన సత్యనారాయణ. మరో మహిళ అదే జిల్లా సత్తెనపల్లి మండలం గోగులపాడు కు చెందిన తన్నీరు కళ్యాణి. వీరిద్దరూ గత కొంతకాలంగా అనకాపల్లి జిల్లా చోడవరంలో ఇల్లు అద్దెకు తీసుకున్నారు. సహజీవనం చేస్తూ ఉన్నారు. సమీప గ్రామాల్లో రెక్కీ చేస్తూ ఒంటరిగా అమాయకంగా కనిపించే వారిని వలవేస్తున్నారు. భావన నిర్మాణ కార్మికులుగా కొన్నిచోట్ల పరిచయం చేసుకొని.. మాయమాటలతో ట్రాప్ చేసి.. మోసగిస్తున్నట్టు గుర్తించారు పోలీసులు. సత్యనారాయణ పై నరసరావుపేట పోలీస్ స్టేషన్లో రౌడీషీట్ కూడా ఉందని పోలీసులు గుర్తించారు. ఇటువంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు పరవాడ డిఎస్పి సత్యనారాయణ, అచ్చుతాపురం సిఐ నమ్మి గణేష్.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి