మచిలీపట్నం, సెప్టెంబర్ 2: నగరంలో వరుస దొంగతనాలకు పాల్పడుతూ కంటి మీద కునుకులేకుండా చేస్తున్న దంపతులను ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి సుమారు 603 గ్రాముల బంగారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కృష్ణా జిల్లా చల్లపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ సంఘటన కృష్ణాజిల్లా చల్లపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. జిల్లాలో వరుస దొంగతనానికి పాల్పడుతున్న భార్యాభర్తలను అరెస్ట్ చేసిన కృష్ణాజిల్లా పోలీసులు.. వారి వద్ద నుండి మూడు కేసుల్లో బంగారం, వెండి నగలు రికవరీ చేశారు. వీటి విలువ సుమారు రూ.56 లక్షల వరకు ఉంటుందని పోలీస్ అధికారులు అంచనా వేస్తున్నారు.
కృష్ణా జిల్లా ఎస్పీ గంగాధరరావు.. దొంగతనానికి పాల్పడుతున్న నిందితుల వివరాలు మీడియా సమావేశం ఏర్పాట్లు చేసి తెలియజేశారు. ఇరుగుపొరుగు వారితో స్నేహంగా ఉంటూ, వారి ఇళ్లల్లో చోరీకి పాల్పడుతున్నట్లు వెల్లడించారు. ఇళ్లకు వెళ్లి, విలువైన వస్తువులు గమనిస్తూ.. యజమానులు ఇంటి వద్ద లేని సమయంలో దొంగతనాలకు పాల్పడుతున్నట్లు పేర్కొన్నారు. నిందితులను షేక్ రహంతున్నిసా, షేక్ నసీబుల్లాగా గుర్తించారు. ఈ కిలాడీ దంపతులపై కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.