Coronavirus Cases In AP: ఏపీలో భారీగా పెరిగిన కరోనా కేసులు.. కొత్తగా ఎన్ని నమోదయ్యాయంటే.!

|

Apr 02, 2021 | 5:41 PM

Coronavirus Cases In AP: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా సెకండ్ వేవ్ తీవ్రత కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1288 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి...

Coronavirus Cases In AP: ఏపీలో భారీగా పెరిగిన కరోనా కేసులు.. కొత్తగా ఎన్ని నమోదయ్యాయంటే.!
Coronavirus Cases In AP
Follow us on

Coronavirus Cases In AP: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా సెకండ్ వేవ్ తీవ్రత కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1288 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. దీనితో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 9,04,548కి చేరింది. ఇందులో 8815 యాక్టివ్ కేసులు ఉండగా.. 8,88,508 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. అటు నిన్న వైరస్ కారణంగా రాష్ట్రంలో ఐదుగురు మృతి చెందారు. దీనితో మొత్తం మరణాల సంఖ్య 7225కు చేరుకుంది. ఇక నిన్న 610 మంది కరోనా నుంచి కోలుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులు అయ్యారు. నేటితో రాష్ట్రవ్యాప్తంగా 1,51,46,104 సాంపిల్స్‌ను పరీక్షించారు.

నిన్న జిల్లాల వారీగా నమోదైన కరోనా కేసులు ఇలా ఉన్నాయి.. అనంతపురం 26, చిత్తూరు 225, తూర్పుగోదావరి 26, గుంటూరు 311, కడప 21, కృష్ణా 164, కర్నూలు 52, నెల్లూరు 118, ప్రకాశం 62, శ్రీకాకుళం 54, విశాఖపట్నం 191, విజయనగరం 31, పశ్చిమ గోదావరి 7 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి.

మరిన్ని ఇక్కడ చదవండి:

ఏపీలో విజృంభిస్తున్న కరోనా మహమ్మారి.. అక్కడ మరోసారి లాక్‌డౌన్.. ఎన్ని రోజులంటే.!

ఆ బ్యాంకుల్లోని ఖాతాదారులకు ముఖ్య గమనిక.. అమలులోకి కొత్త రూల్స్.. వివరాలివే.!

రైల్వే ప్రయాణీకులకు గుడ్ న్యూస్.. ఇవాళ్టి నుంచి పట్టాలెక్కనున్న మరిన్ని స్పెషల్ ట్రైన్స్.!