Corona Vaccine: ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాక్సిన్ వివాదం..స్పందించిన ప్రభుత్వం..రాష్ట్రానికి వచ్చిన టీకాల లెక్కలు ఇవే!

|

May 10, 2021 | 8:58 PM

Corona Vaccine dispute: ఒక పక్క కరోనా పై యుద్ధం కొనసాగుతోంది. మరోవైపు వైరస్ ఉధృతి కూడా అలాగే ఉంది. కరోనాను సమర్ధవంతంగా ఎదుర్కోవాలంటే టీకా ఒకటే మార్గం.

Corona Vaccine: ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాక్సిన్ వివాదం..స్పందించిన ప్రభుత్వం..రాష్ట్రానికి వచ్చిన టీకాల లెక్కలు ఇవే!
Corona Vaccine Dispute
Follow us on

Corona Vaccine Dispute: ఒక పక్క కరోనా పై యుద్ధం కొనసాగుతోంది. మరోవైపు వైరస్ ఉధృతి కూడా అలాగే ఉంది. కరోనాను సమర్ధవంతంగా ఎదుర్కోవాలంటే టీకా ఒకటే మార్గం. అయితే, ఇప్పుడు టీకా కొరత కరోనాపై యుద్ధానికి బ్రేకులు వేస్తోంది. తాజాగా ఆంధ్రప్రదేశ్ లో టీకాల కొరత తో వ్యాక్సినేషన్ కార్యక్రమం దాదాపు నిలిచిపోయింది. దీంతో ఈ వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంది. వ్యాక్సినేషన్ విషయంలో ప్రభుత్వం విఫలం అయిందని విపక్షాలు దాడి మొదలు పెట్టాయి. ఈ నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యాక్సినేషన్ ప్రక్రియపై పూర్తి వివరాలను విడుదల చేసింది. మొత్తంగా రాష్ట్రానికి వచ్చిన వ్యాక్సిన్ లు ఎన్ని.. కేంద్రం ఎన్ని పంపించింది.. రాష్ట్రం తన కోటా కింద ఎన్ని కంపెనీల నుంచి తీసుకుంది.. వంటి వివరాలను పూర్తిగా తెలిపింది ఏపీ ప్రభుత్వం. ఆ వివరాల ప్రకారం..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మొత్తం కోవీషీల్డ్ డోసులు 60,60,400 వచ్చాయి. వాటిలో తొలి డోస్‌ కోసం 43,99,802, రెండో డోస్‌ కింద 16,87,315 వచ్చాయి. అదేవిధంగా కోవాక్సిన్ డోసులు 12,89,560 అందాయి. తొలి డోస్‌ కింద 9,23,296, రెండో డోస్‌ కింద 2,90,047 వ్యాక్సిన్లు అందాయి. రెండూ కలిపి రాష్ట్రానికి వచ్చిన మొత్తం డోసుల సంఖ్య 73,49,960. వీటిలో తొలిడోస్ నిమిత్తం మొత్తం 53,23,098 వ్యాక్సిన్లు అందగా.. రెండో డోస్‌ నిమిత్తం 19,77,362 వ్యాక్సిన్లు అందాయి.

వ్యాక్సిన్ కోసం 45 ఏళ్లకు పైబడిన వారు 1,33,07,889 మంది తమ పేర్లను నమోదు చేసుకున్నారు. వీరిలో తొలి డోస్‌ కింద 41,08,917 మందికి, రెండో డోస్‌ గా 13,35,744 మందికి వ్యాక్సిన్లు ఇచ్చారు.

ఇక మే నెలకు సంబంధించి మొదటి 15 రోజులకు గాను కోవిషీల్డ్, కొవాక్సిన్‌ రెండూ కలిపి 9,17,850 డోస్‌లు ఇస్తామన్న కేంద్రం ఇప్పటి వరకు పంపిణి చేసిన డోస్‌లు 7,65,360 డోస్‌లు. ఇంకా కేంద్రం నుంచి రావలసినవి 1,52,490 డోస్‌లు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కంపెనీల నుంచి నేరుగా కొనుగోలు చేసే కోటాలో కేంద్రం కేటాయించిన డోస్‌లు 16,85,630 అయితే, వీటిలో కేవలం 4,93,930 డోస్‌లు మాత్రమే రాష్ట్రానికి వచ్చాయి. ఇంకా ఈ కోటా కింద రాష్ట్రానికి రావాల్సినవి 11,91,700 డోస్‌లు ఉన్నాయి.

డబ్బులిచ్చినా దొరకడం లేదు.

Corona Vaccine Dispute: వ్యాక్సిన్ కొరతపై స్పందించిన వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్‌ సింఘాల్, వ్యాక్సిన్ కొరత నేపథ్యంలోనే సెకండ్‌ డోస్‌ వారికి మాత్రమే టీకాలు వేస్తున్నట్లు స్పష్టం చేశారు. కేంద్రం నుంచి స్టాక్‌ వచ్చిన వెంటనే అందరికీ వ్యాక్సిన్లు వేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు కోటా ప్రకారం రాష్ట్రాలకు కేంద్రమే వ్యాక్సిన్లు సరఫరా చేస్తోందన్నారు. డబ్బులిచ్చి కొందామన్న లభించని పరిస్థితి నెలకొందని అనిల్‌ కుమార్‌ సింఘాల్‌ తెలిపారు. ఇక కరోనా పేషెంట్స్ కు వైద్యంలో అందించే రెమిడెసివిర్ ప్రస్తుతం ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందుబాటులో ఉందని చెప్పారు. ప్రైవేటు ఆస్పత్రులకు కూడా రెమిడెసివిర్ సరఫరా చేస్తున్నాని ఆయన పేర్కొన్నారు.

Also Read: AP Police Pass: కరోనా ఆంక్షలు.. అత్యవసర పనుల కోసం పోలీస్ ‘పాస్‌’లు కావాలంటే.. ఇలా చేయండి..

BJP Vishnu Vardhan: ఏపీ నుంచి తెలంగాణకు వెళ్లే కరోనా పేషెంట్ల అడ్డగింత.. తీవ్రంగా స్పందించిన విష్ణువర్ధన్ రెడ్డి..