కరోనా అప్‌డేట్స్‌: ఏపీలో తగ్గిన కరోనా కేసులు.. ఇవాళ ఎన్నంటే

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్‌ కాస్త తగ్గుతూ వస్తోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 6,235 కరోనా కేసులు నమోదయ్యాయి

కరోనా అప్‌డేట్స్‌: ఏపీలో తగ్గిన కరోనా కేసులు.. ఇవాళ ఎన్నంటే

Edited By:

Updated on: Sep 21, 2020 | 5:52 PM

AP Corona Bulletin: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్‌ కాస్త తగ్గుతూ వస్తోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 6,235 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 6,31,749కు చేరింది. అలాగే రాష్ట్రంలో కరోనా సోకి తాజాగా 51 మంది మరణించగా.. మృతుల సంఖ్య 45,10కు చేరింది. గడిచిన 24 గంటల్లో 10,502 మంది కరోనాను జయించగా.. కోలుకున్న వారి సంఖ్య 5,48,926 కు చేరింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 51,60,700 కరోనా పరీక్షలు నిర్వహించగా.. ప్రస్తుతం రాష్ట్రంలో 74,518 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

ఇక జిల్లాల వారీగా చూస్తే.. అనంతపురంలో 505 చిత్తూరులో 362, తూర్పు గోదావరిలో 1262, గుంటూరులో 532,  కడపలో 219, కృష్ణాలో 133, కర్నూలులో 190, నెల్లూరులో 401, ప్రకాశంలో 841, శ్రీకాకుళంలో 283, విశాఖలో 150, విజయనగరంలో 395, పశ్చిమ గోదావరిలో 962 కొత్త కేసులు నమోదయ్యాయి. కృష్ణాలో 9 మంది.. చిత్తూరులో ఏడుగురు, విశాఖపట్నంలో ఆరుగురు, అనంతపురంలో ఐదుగురు, తూర్పు గోదావరి నలుగురు, గుంటూరు నలుగురు, నెల్లూరు నలుగురు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో నలుగురు, కర్నూల్‌లో ముగ్గురు, కడపలో ఇద్దరు, ప్రకాశంలో ఇద్దరు, శ్రీకాకుళంలో ఒకరు మరణించారు.

Read More:

ఏపీలో మరో ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్‌

చిరు ‘ఆచార్య’ సెట్స్ పైకి ఎప్పుడు వెళ్లనుందంటే..!