Corona Pandemic: కోవిడ్ నిబంధనలు..ఆంధ్రప్రదేశ్ లో నిలిచిపోయిన ప్రయివేట్ బస్సులు..ప్రభుత్వానికి సమాచారమిచ్చిన బస్సుల యజమానులు!

|

May 02, 2021 | 3:51 PM

కరోనా దేశవ్యాప్తంగా తీవ్రంగా వ్యాపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ లోనూ కరోనా పాజిటివ్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. దీంతో ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవడం ప్రారంభిస్తోంది.

Corona Pandemic: కోవిడ్ నిబంధనలు..ఆంధ్రప్రదేశ్ లో నిలిచిపోయిన ప్రయివేట్ బస్సులు..ప్రభుత్వానికి సమాచారమిచ్చిన బస్సుల యజమానులు!
Private Bus
Follow us on

Corona Pandemic: కరోనా దేశవ్యాప్తంగా తీవ్రంగా వ్యాపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ లోనూ కరోనా పాజిటివ్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. దీంతో ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవడం ప్రారంభిస్తోంది. కరోనా నిబంధనలు కచ్చితంగా అమలు చేసేలా గట్టి ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపధ్యంలో ప్రత్యేకంగా కోవిడ్ నిబంధనలు రూపొందించి అమలు చేస్తోంది. రాష్ట్రంలో ప్రయాణాల పై కూడా ఏపీ ప్రభుత్వం నిబంధనలు విధించింది. ప్రయివేటు బస్సుల్లో 50 శాతం కెపాసిటీ మాత్రమే అనుమతించింది. ఇక అటు ప్రజలు కూడా కోవిడ్ భయంతో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల్లో ప్రయాణించేందుకు ఆసక్తి చూపించడం లేదు. దీంతో ఆంధ్రప్రదేశ్ లో ప్రైవేట్ బస్సుల ప్రయాణాలు నిలిచిపోయాయి. తాము బస్సులు నిలివేస్తున్నామంటూ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల యజమానులు శనివారం తెలిపారు.

మొత్తం 880 బస్సుల రాకపోకలు నిలిచిపోయాయి. రవాణాశాఖకు ప్రయివేట్ బస్సుల యజమానులు ఈమేరకు ముందే తెలియపరిచారు. కోవిడ్ నిబంధనల నేపధ్యంలో బస్సులను తిప్పలేమంటూ రవాణాశాఖకు వారు తెలిపారు. దీంతో రవాణాశాఖ కూడా ఈ బస్సులకు సంబంధించి రావలసిన పాత పన్ను బకాయిలను కూడా పూర్తిగా వసూలు చేసింది. అదేవిధంగా ఈ బస్సులను తిప్పబోవడం లేదని ముందుగానే రవాణాశాఖకు బస్సుల యజమానులు సమాచారం ఇవ్వడంతో బస్సులు తిప్పని కాలానికి పన్నునుంచి మినహాయింపు పొందే అవకాశం ఉంది.

కాగా, ఆంధ్రప్రదేశ్‌లో రోజురోజుకు కరోనా కేసులు తీవ్ర స్థాయిలో నమోదవుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో 98,214 శాంపిళ్లను పరీక్షించగా, అందులో కొత్తగా 19,412 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు ఏపీ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇక కరోనా బారిన విజయనగరంలో ఎనిమిది మంది, విశాఖలో ఏడుగురురు, చిత్తూరులో ఏడుగురు, తూర్పు గోదావరిలో ఏడుగురు, అనంతపురంలో ఆరుగురు, ప్రకాశంలో ఐదుగురు, కర్నూలులో ఐదుగురు, కృష్ణాలో ఐదుగురు, నెల్లూరులో నలుగురు, గుంటూరులో ఇద్దరు, కడపలో ఇద్దరు, శ్రీకాకుళంలో ఇద్దరు, పశ్చిమగోదావరిలో ఒక్కరు చొప్పున మొత్తం 61 మంది మృతి చెందినట్లు తెలిపింది. అదేవిధంగా గడిచిన 24 గంటల్లో 11,579 మంది కోవిడ్‌ నుంచి పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనా కారణంగా సంభవించిన మరణాలు 8,053 కాగా, యాక్టివ్‌ కేసుల సంఖ్య 13,07,552 ఉండగా, కోలుకున్నవారి సంఖ్య 98,2,297.

గడిచిన 24 గంటల్లో ఆయా జిల్లాల్లో నమోదైన పాజిటివ్‌ కేసుల వివరాలు ఇలా ఉన్నాయి.
అనంతపురం 1722, చిత్తూరులో 2768, ఈస్ట్‌ గోదావరి -2679, గుంటూరు – 1750, కడప -792, కృష్ణా – 694, కర్నూలు – 1381, నెల్లూరు – 1091, ప్రకాశం – 1106, శ్రీకాకుళం – 2048, విశాఖ – 1722, విజయనగరం – 606, వెస్ట్‌ గోదావరి – 1053 చొప్పున నమోదయ్యాయి.