Wedding band issue: పెళ్లిళ్ల సమయంలో ఎదురయ్యే గొడవలు చాలా తమాషాగా ఉంటాయి. పెళ్లికూతురు తరఫువారు మర్యాదలు సరిగా లేవని ఘర్షణపడడం చూశాం. భోజనాలు బాగోలేవని గొడవకు దిగడం చూశాం. కానీ.. పెళ్లి బ్యాండుమేళాను కాలనీకి రావొద్దని గొడవకు దిగడం మాత్రం ఇక్కడే వింటున్నాం. గోటితోపోయేదాన్ని గొడ్డలిదాకా తెచ్చుకున్నారు. మిడుతూరు మండలం వీపనగండ్లలో జరిగిందీ ఘటన. నంద్యాలలో ఓ పెళ్లి వేడుకలో భాగంగా ఊరేగింపు చేశారు. మేళతాళాలతో హోరెత్తిస్తున్న బ్యాండుతో గ్రామంలో ఉల్లాసంగా సాగుతోంది ఊరేగింపు. ఓ బజార్‌కు వచ్చిన పెళ్లిబ్యాండును ఆ కాలనీవాసులు అడ్డుకున్నారు. తమ కాలనీలోనుంచి పెళ్లి బ్యాండు వెళ్లడానికి వీల్లేదని హుకుం జారీచేశారు.
పోపోవోయ్.. మీరు చెప్పేదేంటి? అన్నట్లుగా లైట్ తీసుకున్నారు పెళ్లివారు. మేం ఇంతగా చెప్పినా వినరా అంటూ ఆగ్రహంతో ఊగిపోయిన కాలనీవాసులు పెళ్లిబృందాన్ని అడ్డగించారు. మమ్మల్నే అడ్డుకుంటారా? ఎంతధైర్యం మీకు అన్నంతగా కాలనీవాసులతో కయ్యానికి కాలుదువ్వారు పెళ్లిబృందంవారు. ఇంకేముంది? రెండు వర్గాలు నువ్వెంత అంటే నువ్వెంత అంటూ ఒకరిపై ఒకరు దాడులకు దిగారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
వీడియో..