శ్రీకాకుళం ఇండియన్ ఆర్మీ కాలింగ్ సంస్థ దారుణాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. తాజాగా.. ఆ సంస్థ డైరెక్టర్ వెంకటరమణ.. స్టూడెంట్లను బూతులు తిడుతూ కేబుల్ వైర్‌తో విచక్షణారహితంగా కొడుతున్న వీడియోలు తీవ్ర కలకలం రేపాయి. కొన్ని నెలల కిందట జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సోషల్ మీడియాలో దాడి వీడియోలు వైరల్ కావడంతో ఆర్మీ కాలింగ్ సంస్థ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. విద్యార్థుల పట్ల దారుణంగా వ్యవహరించిన సంస్థ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇండియన్ ఆర్మీ, నేవీలో ఉద్యోగాలు ఇప్పిస్తామని ఆశ జూపించి.. 5 నుంచి 10 లక్షల వరకూ ఆర్మీ కాలింగ్ సంస్థ వసూలు చేసింది ఆరోపించారు. జాబ్ ఎప్పుడు ఇప్పిస్తారని ప్రశ్నించిన ఓ యువకుడిపై నిర్వాహకులు విచక్షణారహితంగా దాడి చేశారని మండిపడ్డారు.
ఈక్రమంలో.. స్టూడెంట్‌ను కొడుతున్న వీడియోకు మంత్రి నారా లోకేష్‌కు ట్యాగ్ చేస్తూ ట్వీట్లు చేశారు. ఆర్మీ కాలింగ్ సంస్థ నిర్వాహకులు విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారంటూ ఫిర్యాదు చేశారు. దాంతో.. మంత్రి నారా లోకేష్ సీరియస్ అయ్యారు. కారణాలు ఏవైనా.. ఇలాంటి చర్యలు సరికాదన్నారు. చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించడంతో కేసు నమోదు చేశారు. ఈ ఘటన గతేడాది డిసెంబర్‌లో జరిగినట్లు తెలిపారు. ఇక.. ఆర్మీ కాలింగ్ ఇనిస్టిట్యూట్.. ఇంటర్మీడియట్ విద్యతో పాటు డిఫెన్స్‌లో చేరాలనుకునే విద్యార్థులకు శిక్షణ ఇస్తుంది. అయితే.. ఈ సంస్థపై గతంలోనూ పలు అభియోగాలు వచ్చాయి. లేడీస్ హాస్టల్ రూమ్‌లలో సీసీ కెమెరాలు పెట్టారనే ఆరోపణలతో పోలీసులు దర్యాప్తు చేశారు. అటు.. ఆర్మీ కాలింగ్ సెంటర్‌కు ఇంటర్మీడియట్ కాలేజ్ అనుమతులు కూడా లేవని శ్రీకాకుళం జిల్లా విద్యాశాఖ అధికారులు చెప్పడం ఆసక్తి రేపుతోంది.
అన్నయ్య మీరు .@naralokesh చాలా సీరియస్ గా యాక్షన్ తీసుకోవాల్సిన ఇష్యూ ఇది
శ్రీకాకుళం జిల్లా ఐ ఎ సి (ఇండియన్ ఆర్మీ కాలింగ్) సంస్థ కి ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ బసవ రమణ అనే వ్యక్తి ఆధ్వర్యంలో కొన్ని వేలాదిమంది స్టూడెంట్స్ జీవితాలతో ఆడుకుంటున్నాడు. ఆర్మీలో నేవీలో ఎయిర్ ఫోర్సులో… pic.twitter.com/YcqOTQIuxa
— సొంగ మనోజ్ కుమాRRR (O positive blood group) (@Manu_SMK) December 5, 2024
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి