YS Jagan: సందడిగా అలీ కుమార్తె వివాహ రిసెప్షన్‌.. నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం జగన్‌

|

Nov 29, 2022 | 6:26 PM

సినీ నటుడు, ఏపీ ప్రభుత్వ ఎలక్ట్రానిక్‌ మీడియా సలహాదారు అలీ పెద్ద కుమార్తె ఫాతిమా వివాహ రిసెప్షన్‌కు సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన దంపతులను ఆశీర్వదించారు.

YS Jagan: సందడిగా అలీ కుమార్తె వివాహ రిసెప్షన్‌.. నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం జగన్‌
CM Jagan - Ali
Follow us on

CM YS Jagan attends Ali daughter reception: సినీ నటుడు, ఏపీ ప్రభుత్వ ఎలక్ట్రానిక్‌ మీడియా సలహాదారు అలీ పెద్ద కుమార్తె ఫాతిమా వివాహ రిసెప్షన్‌కు సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన దంపతులను ఆశీర్వదించారు. అలీ దంపతులతో కాసేపు ముచ్చటించారు. మంగళవారం సాయంత్రం గుంటూరు ఇన్నర్‌ రింగ్‌రోడ్‌లోని శ్రీకన్వెన్షన్‌లో అలీ కుమార్తె వివాహ రిసెప్షన్‌ జరిగింది. ఈ రిసెప్షన్‌కు సీఎం జగన్‌ హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించి వారికి శుభాకాంక్షలు తెలిపారు.

సినీ నటుడు అలీ పెద్ద కుమార్తె ఫాతిమా వివాహ రిసెప్షన్‌ ఆదివారం హైదరాబాద్‌ లో కూడా జరిగింది. ఆదివారం సాయంత్రం ఓ ప్రముఖ ఫంక్షన్‌ హాలులో నిర్వహించిన ఈ వేడుకలో టాలీవుడ్‌ సెలబ్రిటీలు సందడి చేశారు. మెగాస్టార్‌ చిరంజీవి దంపతులు, వెంకటేశ్‌, మంచు విష్ణు, బ్రహ్మానందం, ఏపీ మంత్రి రోజాతోపాటు తదితరులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.

Ys Jagan

అనంతరం.. అలీ ఈ రోజు గుంటూరులో రిసెప్షన్‌ను నిర్వహించారు. ఈ వేడుకకు ఏపీకి చెందిన పలువురు ప్రముఖులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.


మరిన్ని ఏపీ వార్తల కోసం..