Heeraben Modi passes away: ప్రధాని మోదీకి మాతృ వియోగం.. తెలుగు రాష్ట్రల ముఖ్యమంత్రుల సంతాపం

ప్రధాని మోదీ తల్లి హీరాబెన్​ మోదీ మృతి పట్ల పలువురు సంతాపం తెెలిపారు.

Heeraben Modi passes away: ప్రధాని మోదీకి మాతృ వియోగం.. తెలుగు రాష్ట్రల ముఖ్యమంత్రుల సంతాపం
Cm Ys Jagan And Cm Kcr Offers Condolences

Updated on: Dec 30, 2022 | 11:32 AM

గుజరాత్‌లోని గాంధీనగర్‌లో ప్రధాని మోదీ మాతృమూర్తి హీరాబెన్‌ అంత్యక్రియలు ముగిశాయి..అంతకుముందు అంతిమయాత్రలో పాల్గొన్న ప్రధాని మోదీ తల్లి పాడె మోశారు. కడసారి హీరాబెన్‌ను చూసి నివాళులర్పించారు స్థానికులు, బీజేపీ నేతలు. హీరాబెన్ మృతి పట్ల సంతాపం తెలిపిన ప్రముఖులు ఆమె పార్థివదేహం వద్ద పుష్పగుచ్చం ఉంచి నివాళులర్పించారు. ఈ ఏడాది జూన్‌ 18న వందేళ్లు పూర్తి చేసుకున్నారు హీరాబెన్‌. మహిమాన్వితమైన ఈశ్వరుడి పాదాల చెంత మా తల్లిగారు విశ్రాంతి తీసుకుంటున్నారని భావోద్వేగ ట్వీట్‌ చేశారు ప్రధాని మోదీ. హీరాబెన్ మృతికి ప్రముఖుల సంతాపం తెలుపుతున్నారు. ఆమె మృతికి రాష్ట్రపతి, ప్రతిపక్ష నేతలు, సీఎంలు సంతాపం తెలిపారు. గుజరాత్​ సీఎం భూపేంద్ర పాటిల్​తో పాటు రక్షణశాఖ మంత్రి రాజనాథ్​ సింగ్​ సంతాపం తెలుపుతూ ట్వీట్​ చేశారు. ఉత్తర్​ ప్రదేశ్​ సీఎం యోగీ ఆదిత్యనాథ్​, మధ్యప్రదేశ్​ సీఎం శివ్​ రాజ్​ సింగ్​ చౌహాన్​, కేంద్ర మంత్రి అమిత్​ షా మోదీకి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ప్రధాని మోదీ తల్లి మృతికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంతాపం తెలుపుతూ నివాళులర్పించారు. రాష్ట్రపతి ముర్ము ట్వీట్ చేస్తూ, “ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తల్లి హీరాబా వంద సంవత్సరాల పోరాట జీవితం భారతీయ ఆదర్శాలకు ప్రతీక.. శ్రీ మోదీ తన జీవితంలో ‘మాతృదేవోభవ’ స్ఫూర్తిని, హీరా బెన్ విలువలను నింపారు. పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నాను. కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి! అంటూ ట్వీట్ చేశారు.

ప్రధాని నరేంద్ర మోదీ మాతృమూర్తి హీరాబెన్ మోదీ మృతిపై తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సంతాపం ప్రకటించారు. ప్రధానికి, వారి కుటుంబ సభ్యులకు సీఎం కేసిఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. తెలంగాణ గవర్నర్ తమిళిసై కూడా ప్రధాని హీరాబెన్ మోదీ మృతి పట్ల విచారం వ్యక్తం చేశారు. మాతృమూర్తిగా హీరాబెన్ గొప్పతనాన్ని చాటుతూ ఓ కవితను కూడా గవర్నర్‌ ట్విట్టర్‌ ద్వారా పోస్ట్ చేశారు. ” శైశవం నుండే దృఢమైననాయకునిగా పెంచి ప్రజా జీవితంలో మేరు పర్వతం వంటి ఉన్నతమైన వ్యక్తిని బలమైన నాయకుణ్ణి ప్రపంచానికి అందించిన అద్వితీయమైన తల్లి శ్రీమతి హీరాబెన్ ఇక లేరు. వయసు పైబడినా పుట్టినప్పటి నుంచి.. ప్రేమ వెలుగులు పరిచిన మాతృ దీపం ఆరిపోయింది. మన ప్రధాని ప్రేమ వెల్లువ కనుమరుగైందన్న వార్త వింటే మా కళ్లలో నీళ్లు తిరిగాయి. దేనినైనా తట్టుకునే శక్తిని మన ప్రధాని నరేంద్ర మోడీ జి కి ఎల్లప్పుడూ ఇచ్చే భగవంతుడు ఇప్పుడు కూడా ఈ మాతృ వియోగాన్ని తట్టుకునే శక్తి ఇచ్చి ఆశీర్వదించా లని ప్రార్ధిస్తున్నాను. అంటూ ట్వీట్ చేశారు.

ప్రధాని నరేంద్రమోదీ తల్లి హీరాబెన్‌ మోదీ మృతిపై ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీకి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.


మరిన్ని జాతీయ వార్తల కోసం