CM Jagan Tour Schedule: బుధవారం విజయనగరంలో జిల్లాలో సీఎం జగన్ పర్యటన.. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బుధవారం నాడు విజయనగరం జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా..

CM Jagan Tour Schedule: బుధవారం విజయనగరంలో జిల్లాలో సీఎం జగన్ పర్యటన.. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం..

Updated on: Dec 29, 2020 | 8:16 PM

CM Jagan Tour Schedule: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బుధవారం నాడు విజయనగరం జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంలో పాల్గొంటారు. ఉదయం 9.30 గంటలకు సీఎం జగన్ తాడేపల్లి నుంచి బయలుదేరుతారు. 11.15 గంటలకు విజయనగరం జిల్లాలోని గుంకలాం చేరుకుంటారు. అక్కడ నిర్మించ తలపెట్టిన భారీ కాలనీలో పట్టాలు పంపిణీ చేయడంతో పాటు.. ఇళ్ల నిర్మాణ పనులను సీఎం ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 2.45 గంటలకు తిరిగి తాడేపల్లిలోని తన నివాసానికి సీఎం చేరుకుంటారు.

కాగా, విజయనగరం నియోజకవర్గంలోని విజయనగరం రూరల్‌ మండలం గుంకలాం వద్ద 397.36 ఎకరాల్లో 12,301 మంది లబ్దిదారుల కోసం భారీ లే అవుట్‌ సిద్ధం చేశారు. రూ.4.37 కోట్లతో లే అవుట్‌ను ప్రభుత్వం అభివృద్ధి చేసింది. పేదలకు స్థలాలు ఇచ్చేందుకుగానూ 428 మంది రైతుల నుంచి 101.73 కోట్ల రూపాయలతో భూమిని ప్రభుత్వం కొనుగోలు చేసింది. మొత్తంగా విజయనగరం జిల్లాలో 1,08,230 మంది లబ్ధిదారులకు ప్రభుత్వం ఇళ్లపట్టాలు పంపిణీ చేస్తోంది. దీనిలో గ్రామీణ ప్రాంతాలకు చెందిన 65,026 మంది, పట్టణ ప్రాంతాలకు చెందిన 43,204 మంది లబ్ధిదారులు వున్నారు. పేదలకు ఇళ్ళస్థలాలు కేటాయించేందుకు ప్రభుత్వం మొత్తం 1,164 లే అవుట్‌లను సిద్ధం చేసింది. వీటిని అభివృద్ధి చేసేందుకు రూ.10.19 కోట్లు ఖర్చు చేసింది.

 

Also read:

Love Jihad: ఆ అధికారం ఎవరికీ లేదు.. లవ్ జిహాద్‌పై అసదుద్దీన్ ఓవైసీ సంచలన కామెంట్స్..

Treasure Hunt : వికారాబాద్‌లో గుప్త నిధుల కలకలం.. బంగారు గణపతి విగ్రహం లభ్యం..సీన్‌లోకి పోలీసులు