Vijayawada: ఇక ఇంద్రకీలాద్రిపై ఆ కష్టాలుండవు.. అత్యాధునిక హంగులతో అమ్మవారి ఆలయం

విజయవాడ కనకదుర్గమ్మ ఆలయాన్ని 225కోట్ల రూపాయలతో సమగ్ర ప్రణాళికతో అభివృద్ధి చేస్తున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు లేకుండా దుర్గ గుడిని తీర్చిదిద్దుతున్నారు. ఈ అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం జగన్ ఈనెల 7వ తేదీ గురువారం శంకుస్థాపన చేస్తారు. ఎన్నికల సమయంలోనూ అభివృద్ధి పనులకు ఆటంకం కలగకుండా జాగ్రత్తలు తీసుకోబోతున్నారు. నాలుగంతస్తుల ఆటోమేటిక్‌ కార్ పార్కింగ్‌ సిద్ధం చేయబోతున్నారు.

Vijayawada: ఇక ఇంద్రకీలాద్రిపై ఆ కష్టాలుండవు.. అత్యాధునిక హంగులతో అమ్మవారి ఆలయం
Cm Jagan To Lay The Foundation Stone For The Development Works At Vijayawada Indrakiladri Kanakadurga Temple.

Updated on: Dec 06, 2023 | 9:00 PM

విజయవాడ కనకదుర్గమ్మ ఆలయాన్ని 225కోట్ల రూపాయలతో సమగ్ర ప్రణాళికతో అభివృద్ధి చేస్తున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు లేకుండా దుర్గ గుడిని తీర్చిదిద్దుతున్నారు. ఈ అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం జగన్ ఈనెల 7వ తేదీ గురువారం శంకుస్థాపన చేస్తారు. ఎన్నికల సమయంలోనూ అభివృద్ధి పనులకు ఆటంకం కలగకుండా జాగ్రత్తలు తీసుకోబోతున్నారు. నాలుగంతస్తుల ఆటోమేటిక్‌ కార్ పార్కింగ్‌ సిద్ధం చేయబోతున్నారు. దీంతో ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం దొరకనుంది. గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా మొదటిసారి సీఎం జగన్‌ ఆలయాభివృద్ధికి 70 కోట్లు కేటాయించారన్నారు దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ.
ఇంద్రకీలాద్రిపై మాస్టర్ ప్లాన్ అమలులో భాగంగా చేపడుతున్నఎలివేటెడ్ క్యూ కాంప్లెక్సు నిర్మాణం, మల్టీలెవెల్ వాహనాల పార్కింగ్, శివాలయం పునరుద్ధరణ, ప్రసాదం పోటు నిర్మాణ పనులు మొదలయ్యాయి. మరోవైపు కొండచరియలు పడకుండా జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. నిరుపయోగంగా వదిలేసిన క్యూలైన్లకు, ర్యాంపు నిర్మించి ఉపయోగంలోకి తీసుకురానున్నారు. రాష్ట్ర ప్రభుత్వ నిధులతో పాటు దేవస్థాన నిధులతో మోడరన్ ఇంద్రకీలాద్రిగా మారనుంది.
భక్తులకు ఇబ్బంది లేకుండా తిరుమల తిరుపతి తరహాలో అభివృద్ధి పనులు జరగనున్నాయి. అలాగే మాస్టర్ ప్లాన్ ప్రకారం అభివృద్ధి పనుల స్పీడ్‌ పెరగనుంది. అభివృద్ధి పనుల పరిస్థితిని బట్టి ఘాట్ రోడ్‌పై నిర్ణయం తీసుకోనున్నారు. రేపు సీఎం జగన్‌ శంకుస్థాపన చేశాక.. 18 నెలల్లోపు పనులు పూర్తవుతాయని అలయాధికారులు అంచనా వేస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..