రాష్ట్రంలో ఆడపడుచులు తక్కువ పెట్టుబడితో ఆర్థికంగా ఎదగడానికి చేపట్టిన జగనన్న జీవక్రాంతి పథకాన్ని గురువారం సీఎం జగన్ ప్రారంభించారు. తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో వీడియో సమావేశం ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. పాదయాత్రలో ఇచ్చిన మరో హామీని ఈరోజు నెరవేర్చాం. అక్కాచెల్లెమ్మలకు సరైన జీవనోపాధి, సుస్థిర ఆదాయం లక్షమే ఈ జగనన్న జీవక్రాంతి పథకం ముఖ్యం ఉద్దేశం. వ్యవసాయ అనుబంధ రంగాలను ప్రొత్సహించడం ద్వారా.. రైతుల్లో ఆర్థిక అభివృద్ది వస్తుంది. గత ప్రభుత్వం ఈ విషయంలో చాలా నిర్లక్ష్యంగా ప్రవర్తించాయి. జగనన్న జీవక్రాంతి పథకాన్ని అమూల్ సంస్థతో ఒప్పందం చేసుకోవడం ద్వారా పాడి రైతులకు, మహిళలకు ఆర్థికంగా చేయూతనిస్తుంది. ఈ పథకం కింద 2.49 లక్షల గొర్రెలు, మేకల యూనిట్లు పంపిణీ చేయనున్నామని.. రూ.1.869 కోట్ల వ్యయంతో జగనన్న జీవక్రాంతి పథకం ప్రారంభించాం. మహిళలకు ఆర్థిక వనరులు పెరగాలని.. చేయూత, ఆసరా పథకాల ద్వారా రూ.5,400 కోట్లు అందిస్తున్నారు. ఈ పథకం ద్వారా 45 ఏళ్ళ నుంచి 60 ఏళ్ళ లోపు వయసు గల బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల మహిళలకు ప్రభుత్వం ఆర్థిక సాయంతోపాటు రైతు భరోసా కేంద్రాల ద్వారా గొర్రెలు, మేకల యూనిట్లను పంపిణీ చెస్తామన్నారు.