Andhra Pradesh: మంత్రి పదవులు దక్కనివారికి కీలక పదవులు.. కన్ఫామ్ చేసిన సీఎం జగన్

|

Apr 10, 2022 | 7:34 PM

ఏపీ కేబినెట్‌ విస్తరణలో పలు వర్గాలకు ప్లేసు దక్కలేదు. కమ్మ,వైశ్య, బ్రాహ్మణ, క్షత్రియ వర్గాలకు ప్లేస్ చోటు కల్పించలేదు. అయితే ఆ వర్గాలకు చెందిన ఎమ్మెల్యేలకు కీలక పదవులు ఇవ్వనున్నారు సీఎం జగన్.

Andhra Pradesh: మంత్రి పదవులు దక్కనివారికి కీలక పదవులు.. కన్ఫామ్ చేసిన సీఎం జగన్
Kodali Malladi
Follow us on

CM Jagan: జగన్ టీమ్ 2.0లో అనేక మార్పులు చోటుచేసుకోబోతున్నాయి. కుల, సామాజిక అంశాలతో పాటు సీనియారిటీ అంశాల ఆధారంగానే మంత్రి వర్గ కూర్పు జరిగింది. ముందుగా ఊహించినట్టుగానే 11 మంది పాత వాళ్లకి ఛాన్స్ దక్కింది. కొత్తవాళ్లు 14 మంది జగన్ 2.0 కేబినెట్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. మొత్తంగా 25 మందితో కొత్త కేబినెట్ ఏర్పాటు కాబోతోంది. ఈసారి బీసీలకు అధిక ప్రాధాన్యం దక్కింది. బీసీలు గతంలో ఏడుగురు ఉంటే.. ఈ సారి అత్యధికంగా 10 మందికి అవకాశం దక్కింది. త్వరలో ఏపీ స్టేట్‌ డెవలప్‌మెంట్‌ బోర్డు ఏర్పాటు చేసి.. చైర్మన్‌గా కొడాలి నాని(Kodali Nani)కి అవకాశం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. కేబినెట్‌ హోదాతో కొడాలి నానికి అవకాశం కల్పించనుంది. ప్లానింగ్‌బోర్డు వైస్‌చైర్మన్‌గా మల్లాది విష్ణు(Malladi Vishnu), డిప్యూటీ స్పీకర్‌గా కోలగట్ల వీరభద్ర స్వామి, చీఫ్‌ విప్‌గా ప్రసాదరాజుకు అవకాశం ఇవ్వనుంది.

భగ్గుమన్న సామినేని అనుచరులు…

మంత్రి పదవిపై ఎన్నో ఆశలు పెట్టుకున్న సామినేని ఉదయభానుకు నిరాశే ఎదురైంది. ఫైనల్ లిస్ట్‌లో ఆయన పేరు లేదు. దీంతో ఉదయభాను అనుచరులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. జగ్గయ్యపేట మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌, కౌన్సిలర్లు రాజీనామాకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఫైనల్ లిస్ట్ బయటికి రాక ముందు వరకు కూడా ఆయన ఎంతో ధీమాగా ఉన్నారు. సీనియర్ అయిన తనకు మంత్రి పదవి ఎందుకు రాదంటూ మీడియాతో మాట్లాడారు. కానీ ఫైనల్ లిస్ట్‌లో మాత్రం పేరు లేదు. ప్రస్తుతం విప్‌గా ఉన్నారు భాను. వైఎస్సార్ హయాంలో కూడా విప్‌గా పనిచేశారు . జగన్ సీఎం అయ్యాక తొలిసారే కేబినెట్‌లో బెర్త్ ఆశించారు భాను. కానీ విస్తరణలో పక్కాగా ఇస్తామని అప్పట్లో నచ్చజెప్పారు జగన్.

Also Read: Andhra Pradesh: ఇదే ఏపీ నూతన మంత్రుల ఫైనల్ లిస్ట్.. 25 మందితో కొత్త కేబినెట్..