పల్నాడు, జూన్ 12: ఆంధ్రప్రదేశ్‌లో జగనన్న విద్యా కానుక పథకం నాలుగో విడతను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు. స్కూళ్లు ప్రారంభమైన తొలిరోజే విద్యాకానుక అందజేశారు. ప్రభుత్వ బడులకు వెళ్లే విద్యార్ధులకు అవసరమైన వస్తువులతో కూడిన విద్యా కానుక కిట్లను ఇవాళ పంపిణీ చేశారు. అనంతరం సీఎం జగన్ మాట్లాడుతూ.. ప్రపంచాన్ని ఏలే పరిస్థితుల్లో మన విద్యార్థులు ఉండాలి. టోఫెల్ పరీక్షలకు సిద్ధమయ్యేలా విద్యార్థులను రెడీ చేశాం. గవర్నమెంట్ స్కూళ్లలో సీబీఎస్ఈ, ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చాం. ఇంగ్లీష్ అనర్గళంగా మాట్లడేందుకు శిక్షణ ఇస్తున్నాం. బడి ప్రారంభం రోజే విద్యార్థులకు ఉచితంగా బుక్‌లు, యూనిఫాం ఇస్తున్నాం. ప్రభుత్వ, ఎయిడెడ్ స్కూల్ విద్యార్థులకు విద్యాకానుక. రాష్ట్ర వ్యాప్తంగా పండుగలా విద్యాకానుక జరుపుతున్నామన్నారు. బడి పిల్లలు ఓటర్లు కాదు.. అయినా జగన్ మామ వారికి కానుక ఇస్తున్నాడు. విద్యాకానుక కిట్లలో మెరుగైన మార్పులు తెచ్చాం. రూ. 1042కోట్లతో బడిపిల్లలకు కానుకలను ఇస్తున్నాం.
అంతకు ముందు జగనన్న విద్యాకానుక పంపిణీ కార్యక్రమం కోసం పల్నాడు జిల్లా పెద కూరపాడు నియోజకవర్గంలోని క్రోసూరులో ఓ ప్రభుత్వ స్కూలుకు వెళ్లిన సీఎం జగన్.. అక్కడి విద్యార్థులకు ముుందుగా శుభాకాంక్షలు తెలిపారు. ఆ తర్వాత స్కూల్‌లోని ఓ తరగతి గదిలో విద్యార్థులతో కూర్చున్న సీఎం జగన్.. అక్కడి విద్యార్థులతో ముచ్చటిచారు. అనంతరం విద్యా కానుక కిట్లను పరిశీలించారు.
2023-24 విద్యా సంవత్సరానికి జగనన్న విద్యాకానుక పంపిణీ జరుగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో 1 నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న 43,10,165 మంది విద్యార్థినీ, విద్యార్థులకు రూ.1,042.53 కోట్ల ఖర్చుతో ఈ కిట్లను పంపిణీ చేస్తున్నారు.విద్యా కానుక కిట్‌లో ప్రతి విద్యార్థికీ ఉచితంగా ఇంగ్లీష్-తెలుగులో ముద్రించిన పాఠ్య పుస్తకాలు, నోట్ బుక్స్, వర్క్ బుక్స్, 3 జతల యూనిఫామ్ క్లాత్ కుట్టు కూలితో సహా ఇస్తున్నారు.
ఒక జత బూట్లు, రెండు జతల సాక్సులు, బెల్టు, స్కూలు బ్యాగుతో పాటు 6-10 తరగతి పిల్లలకు ఆక్స్‌ఫర్డ్ ఇంగ్లీషు-తెలుగు డిక్షనరీ, 1-5 తరగతి పిల్లలకు పిక్టోరియల్ డిక్షనరీతో కూడిన విద్యాకానుక కిట్‌ను స్కూల్ ప్రారంభమైన తొలిరోజే అందిస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం