Andhra Pradesh: మనసు మార్చుకున్న సీఎం జగన్.. కొత్త మంత్రివర్గంలో ఆ 10 మందిని కొనసాగించే చాన్స్!

ముఖ్యమంత్రి జగన్ పాత కేబినెట్‌లో ఎవరెవరిని కొనసాగిస్తారన్నది హాట్ టాపిక్ అయ్యింది. సీనియర్లకు ప్రాధాన్యం ఇస్తారా.. సామాజిక సమీకరణాలు తీసుకుని కొనసాగిస్తారా అన్నది సస్పెన్స్‌గా మారింది. తాజాగా ఓ ఆసక్తికర అప్‌డేట్ బయటకు వచ్చింది.

Andhra Pradesh: మనసు మార్చుకున్న సీఎం జగన్.. కొత్త మంత్రివర్గంలో ఆ 10 మందిని కొనసాగించే చాన్స్!
Cm Jagan

Updated on: Apr 08, 2022 | 12:37 PM

CM Jagan: సీఎం జగన్‌ టీమ్‌ 24ని లాంచ్‌ చేయబోతున్నారు. ఇప్పటికే 24 మంది మంత్రులు రాజీనామాలు సమర్పించారు. ఈ నేపథ్యంలో ఇంట్రెస్టింగ్‌ అప్‌డేట్‌ అందుతోంది. పాత టీమ్‌లో సీనియర్లను కొనసాగించేందుకు సీఎం రెడీ అయినట్లు తెలుస్తోంది. దాదాపు పది మంది వరకు మళ్లీ చాన్స్‌ దక్కే అవకాశాలున్నాయి. పనితీరు, కులాలు, జిల్లాల పునర్వ్యవస్థీకరణ నేపథ్యంలో పాతవారికి కొనసాగించబోతున్నారు. పాతమంత్రులు కొనసాగే జాబితాలో.. పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి, బొత్స సత్యానారాయణ, కొడాలి నాని(Kodali Nani), పేర్ని నాని(Perni Nani), సీదిరి అప్పలరాజు, చెల్లుబోయిన వేణుగోపాల్‌, గుమ్మనూరు జయరాం, ఆదిమూలపు సురేష్‌(Adimulapu Suresh), అంజాద్‌ బాషా, తానేటి వనిత ఉన్నట్లు తెలుస్తోంది. పాత టీమ్‌లో ఒకరిద్దరికే చాన్సులుంటాయని అంతా అనుకుంటున్న సమయంలో.. జగన్‌ తన నిర్ణయాన్ని మార్చుకున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా.. రాబోయే రెండేళ్లు చాలా కీలకం కాబట్టి.. కేబినెట్‌లో సీనియర్లు అవసరమనే యోచనలో సీఎం ఉన్నట్లు తెలుస్తోంది.

మంత్రివర్గ మార్పుపై జోరుగా చర్చ జరుగుతున్న సమయంలో.. కొందరు నేతలు భేటీ కావడం కీలకంగా మారింది. సచివాలయంలో సజ్జలతో, బొత్స, అనిల్ కుమార్ యాదవ్‌తో పాటు కన్నబాబు సమావేశమయ్యారు. ఈ మీటింగ్‌లో కొంత మంది అధికారులు కూడా పాల్గొనడం చర్చనీయాంశమైంది.

మరోవైపు మంత్రులంతా రాజీనామా చేయడంతో సచివాలయంలోని మంత్రుల పేషీలన్నీ బోసిపోయి ఉన్నాయి. మంత్రుల ఛాంబర్లన్నీ ఖాళీగా కనిపిస్తున్నాయి. మంత్రులు లేకపోవడంతో.. సమస్యలు చెప్పుకోవడానికి వచ్చే ప్రజలు కూడా సచివాలయం పరిసరాల్లో లేరు. అధికారుల హడావుడి.. కూడా తగ్గిపోయింది. సీఎం జగన్ కొత్త టీం ఎలా ఉండబోతుంది.. ఏ శాఖకు ఎవరు మంత్రిగా వస్తారనే ఆసక్తితో అందరూ ఎదురుచూస్తున్నారు.

Also Read: Telangana: యువతి ప్రాణం తీసిన వాట్సాప్ స్టేటస్.. తల్లిదండ్రులకు కడుపు కోత