సొంత పార్టీ కార్యకర్తలకు బంపర్ ఆఫర్ ప్రకటించారు ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. ఇందులో భాగంగా.. గురువారం సాయంత్రం ముందుగా చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గ కార్యకర్తలతో సీఎం జగన్ ప్రత్యేకంగా సమేశమయ్యారు. టీడీపీ అధినేత చంద్రబాబు హయాంలో కంటే.. గత మూడేళ్లలోనే కుప్పం నియోజకవర్గానికి ఎక్కువ మేలు జరిగిందన్నారు. వైసీపీ కార్యకర్తలతో భేటీలో భాగంగా.. గురువారం సాయంత్రం మొదటగా చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గ వైసీపీ కార్యకర్తలతో సీఎం జగన్ సమావేశమయ్యారు.
రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో 175కి 175 సీట్లు గెలిచే పరిస్థితి ప్రస్తుతం కుప్పం నుంచే మొదలు కావాలని పిలుపునిచ్చారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో 175కి 175 సీట్లు గెలిచే పరిస్థితి కుప్పం నుంచే మొదలు కావాలని ఈ సందర్భంగా కార్యకర్తలను ఉద్దేశించి ఆయన పేర్కొన్నారు. సీఎం జగన్ మాట్లాడుతూ..” కుప్పం నా సొంత నియోజకవర్గంతో సమానం. ఇక్కడ భరత్‌ను గెలిపిస్తే.. ఆయనకు మంత్రి పదవి గ్యారెంటీ. చంద్రబాబు హయాంలో కన్నా.. ఈ మూడేళ్లలో కుప్పం నియోజకవర్గానికి మేలు ఎంతో జరిగింది. భవిష్యత్తులోనూ మరింత జరగుతుంది.
ఇప్పటికిప్పుడు కుప్పం మున్సిపాల్టీకి రూ.65 కోట్ల విలువైన పనుల నిధులను మంజూరు చేస్తున్నట్లుగా వెల్లడించారు. కుప్పం అభివృద్ధికి అండగా ఉంటామని సీఎం జగన్.. కార్యకర్తలను ఉద్దేశించి వెల్లడించారు. పార్టీ క్యాడర్‌ను ఎన్నికలకు రెడీ చేసేలా సీఎం జగన్ మాట్లాడారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం..