YSRCP: పార్టీలో చేరిన వెంటనే బంపర్ ఆఫర్.. మాజీ ఐఏఎస్‎కు టికెట్ ఖరారు చేసిన సీఎం జగన్..

కర్నూలు ఎమ్మెల్యేగా బరిలో నిలవనున్నారు మాజీ సీనియర్ ఐఏఎస్ అధికారి ఇంతియాజ్. ఇటీవలే విఆర్‎యస్ తీసుకొని వైసీపీలోకి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు ఈయన. ఈరోజు తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఇంతియాజ్ వైసీపీలో చేరారు. ఆయన్ను వైఎస్ జగన్ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఇంతియాజ్‎తో పాటు మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి, సిట్టింగ్ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ పాల్గొన్నారు. వీరిద్దరి సమక్షంలోనే ఇంతియాజ్‎ను ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించారు సీఎం జగన్. ఈ విషయాన్ని పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్ రామ సుబ్బా రెడ్డి అధికారికంగా వెల్లడించారు.

YSRCP: పార్టీలో చేరిన వెంటనే బంపర్ ఆఫర్.. మాజీ ఐఏఎస్‎కు టికెట్ ఖరారు చేసిన సీఎం జగన్..
Cm Jagan

Updated on: Feb 29, 2024 | 2:11 PM

కర్నూలు ఎమ్మెల్యేగా బరిలో నిలవనున్నారు మాజీ సీనియర్ ఐఏఎస్ అధికారి ఇంతియాజ్. ఇటీవలే విఆర్‎యస్ తీసుకొని వైసీపీలోకి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు ఈయన. ఈరోజు తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఇంతియాజ్ వైసీపీలో చేరారు. ఆయన్ను వైఎస్ జగన్ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఇంతియాజ్‎తో పాటు మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి, సిట్టింగ్ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ పాల్గొన్నారు. వీరిద్దరి సమక్షంలోనే ఇంతియాజ్‎ను ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించారు సీఎం జగన్. ఈ విషయాన్ని పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్ రామ సుబ్బా రెడ్డి అధికారికంగా వెల్లడించారు. ఎస్వీ మోహన్ రెడ్డి, హఫీజ్ ఖాన్‎కు పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని సీఎం జగన్ హామీ ఇచ్చినట్లు తెలిపారు కర్నూలు జిల్లాకు చెందిన సీనియర్ నాయకులు.

ఆ తరువాత మీడియా ముందుకు వచ్చిన కర్నూలు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్ధి ఇంతియాజ్ మాట్లాడుతూ.. సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆశయాల మేరకు కర్నూలు అభ్యర్థిగా పోటీ చేస్తున్నానన్నారు. వ్యక్తిగత సమస్యలు ఏమున్నా అందరినీ కలుపుకొని ముందుకు వెళ్తానన్నారు. అసమానతలు లేని సమాజం నిర్మించాలని అడుగులు వేస్తున్నట్లు తెలిపారు. వైసీపీ అమలు చేస్తున్న నవరత్నాలు ప్రజలకు మేలు చేశాయని చెప్పారు. ఈసారి కూడా కర్నూలు జిల్లాలో వైసీపీ క్లీన్ స్వీప్ చేసి చూపిస్తామన్నారు.

కర్నూలు మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. ఇంతియాజ్‎తో కలిసి పని చేస్తానన్నారు. సీఎం జగన్ ప్రకటించిన అభ్యర్థి ఇంతియాజ్‎ను కర్నూలులో గెలిపిస్తామని చెప్పారు. కొండారెడ్డి బురుజుపై వైసీపీ జెండా ఎగరెస్తానని పేర్కొన్నారు. మాకు రాజకీయంగా అండగా ఉంటామని సీఎం హామీ ఇచ్చినట్లు తెలిపారు. మా రాజకీయ భవిష్యత్తు కంటే పార్టీ ముఖ్యం అని చెప్పారు. పార్టీ బాగుంటే మేమంతా బాగుంటామని సీఎం జగన్ నిర్ణయం మేరకే ఇంతియాజ్ గెలుపుకు కృషిచేస్తామన్ని చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి

ఇక ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న హఫీజ్ ఖాన్ మాట్లాడుతూ.. మైనార్టీలకు జగన్ అండగా ఉన్నారన్నారు. మెజార్టీ స్థానాల్లో మైనారిటీలకు సీఎం జగన్ అవకాశం కల్పించారని ఈ సందర్భంగా చెప్పారు. ప్రతి ఒక్కరూ బాగుండాలని అనేది జగన్ మోహన్ రెడ్డి ఆలోచన అని తెలిపారు. 14 యేళ్లుగా పార్టీలో ఉన్న నాకు అవకాశం లేదని కార్యకర్తలు ఆందోళన చెందుతున్నట్లు వెల్లడించారు. సీఎం జగన్ నిర్ణయం మేరకు తన అడుగులు ఉంటాయని తెలిపారు. జగన్ సీఎం అవ్వడం తనకు ముఖ్యమని.. ప్రస్తుతం తాను ఎక్కడ పోటీ చేయడం లేదన్న విషయాన్ని స్పష్టం చేశారు. మా గౌరవం ఎక్కడా తగ్గకుండా సముచిత స్థానం కల్పిస్తామని సీఎం జగన్ హామీ ఇచ్చినట్లు వెల్లడించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..