CM YS Jagan: నేడు ఏపీలో క్లాప్‌ పథకం ప్రారంభం, మ.12 వరకు ట్రాఫిక్‌ ఆంక్షలు. హైదరాబాద్‌, చెన్నై వెళ్లే వాహనాలు మళ్లింపు

|

Oct 02, 2021 | 7:59 AM

నేడు ఆంధ్ర ప్రదేశ్‌లో క్లాప్‌ పథకం ప్రారంభం కానుంది. ఈ పథకాన్ని సీఎం వైయస్ జగన్ విజయవాడ బెంజ్‌ సర్కిల్‌లో ప్రారంభించనున్నారు.

CM YS Jagan: నేడు ఏపీలో క్లాప్‌ పథకం ప్రారంభం, మ.12 వరకు ట్రాఫిక్‌ ఆంక్షలు. హైదరాబాద్‌, చెన్నై వెళ్లే వాహనాలు మళ్లింపు
Clap Scheme
Follow us on

AP CM Jagan Clap scheme: నేడు ఆంధ్ర ప్రదేశ్‌లో క్లాప్‌ పథకం ప్రారంభం కానుంది. ఈ పథకాన్ని సీఎం వైయస్ జగన్ విజయవాడ బెంజ్‌ సర్కిల్‌లో ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా స్వచ్ఛ సంకల్పంలో సీఎం పాల్గొంటారు. చెత్త సేకరణకు కొత్తగా 4,097 వాహనాలను జగన్ సర్కారు ఇప్పటికే కొనుగోలు చేసింది. ఫలితంగా కృష్ణా జిల్లాలో మ.12వరకు ట్రాఫిక్‌ ఆంక్షలు అమల్లో ఉంటాయి. హైదరాబాద్‌, చెన్నై వెళ్లే వాహనాలు మళ్లింపు చేస్తున్నారు. హనుమాన్‌ జంక్షన్‌ నుంచి.. పామర్రు, రేపల్లె మీదుగా ఒంగోలు మళ్లింపు చేస్తున్నారు. ఇక, నూజివీడు, ఇబ్రహీంపట్నం మీదుగా.. హైదరాబాద్‌ వెళ్లే వాహనాలను తరలిస్తున్నారు.

ఇవాళ గాంధీ జయంతిని పురస్కరించుకుని నేటి నుంచి వంద రోజుల జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. స్వచ్ఛాంధ్రపదేశ్‌ నినాదంతో కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తామన్నారు. చెత్త సేకరణ కోసం ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేయనున్నట్లు ​వెల్లడించారు. గ్రామాల పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించనున్నట్లు పెద్దిరెడ్డి తెలిపారు. రాష్ట్రంలో 13 వేలకు పైగా ఉన్న పంచాయితీల్లో సాలీడ్ వేస్ట్ మేనేజ్మెంట్ సిస్టం ప్రవేశ పెడుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో 10 వేల మంది గ్రామ పంచాయితీ కార్మికులు పాల్గొంటారని.. కొత్తగా 4,171 చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాల నిర్మాణం చేపట్టనున్నామని మంత్రి తెలిపారు.

స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్‌ సాధనకు ప్రజలంతా కలిసి రావాలని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. పరిశుభ్రతలో తిరుపతి, విశాఖ, విజయవాడలకు అవార్డులు వచ్చాయన్న బొత్స.. శానిటేషన్‌పై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు. తడి, పొడి చెత్త సేకరణ కోసం ఇంటింటికి 3 డస్ట్‌బిన్‌లు ఇవ్వనున్నామని తెలిపారు. పబ్లిసిటీపై కాదు.. పనులపైనే సీఎం జగన్‌ దృష్టి పెట్టారన్నారు బొత్స.

Read also: Japanese Princess: ప్రేమ కోసం త‌న వార‌స‌త్వ భారీ సంప‌ద‌ను వ‌దులుకొని పెళ్లిపీటలెక్కబోతోన్న జపాన్ యువరాణి