Andhra Pradesh: రక్షణగా ఉండాల్సిన పోలీసులే అందినకాడికి దోచుకెళ్లారు.. ఆఖరికి సీసీటీవీకి పట్టుబడి సస్పెండ్ అయ్యారు..

|

Sep 12, 2021 | 5:44 AM

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరులో రోడ్డు ఫుట్‌పాత్ పై బట్టల దుకాణంలో బట్టలను దొంగలించిన ఇద్దరు పోలీసులు సస్పెండ్ అయ్యారు. ఈ మేరకు ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.

Andhra Pradesh: రక్షణగా ఉండాల్సిన పోలీసులే అందినకాడికి దోచుకెళ్లారు.. ఆఖరికి సీసీటీవీకి పట్టుబడి సస్పెండ్ అయ్యారు..
Police
Follow us on

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరులో రోడ్డు ఫుట్‌పాత్ పై బట్టల దుకాణంలో బట్టలను దొంగలించిన ఇద్దరు పోలీసులు సస్పెండ్ అయ్యారు. ఈ మేరకు ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. సస్పెండ్ అయిన వారిలో ఏఆర్ ఎస్సై మహమ్మద్ బాషా, ఏఆర్ కానిస్టేబుల్ ఇంతియాజ్‌ ఉన్నారు. వివరాల్లోకెళితే.. చిత్తూరులో కలక్టరేట్‌కు వెళ్లే రోడ్డు పక్కన ఫుట్‌పాత్‌పై కొందరు వ్యాపారులు బట్టలు విక్రయించేవారు. అయితే, రాత్రి సమయంలో దుస్తులను మూటగట్టి ఒమిని వ్యాన్‌లో ఉంచి వెళ్లారు. ఉదయం వచ్చేసరికి కొన్ని దుస్తులు చోరీకి గురైనట్లు సదరు వ్యాపారి గుర్తించాడు.

వెంటనే సీసీటీవీ ఫుటేజీ పరిశీలించగా.. ఇద్దరు పోలీసులు ఆ బట్టలను దొంగిలించినట్లుగా స్పష్టమైంది. దాంతో బాధిత వ్యాపారి పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. విచారణలో సదరు పోలీసులే బట్టలు దొంగిలించినట్లు నిరూపితమైంది. దాంతో జిల్లా పోలీసు యంత్రాంగం వారిని సస్పెండ్ చేసింది. కాగా, బట్టల దుకాణంలో దుస్తులు చోరీ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

Also read:

Red Tamarind : ఎరుపు రంగులో చింతకాయలు.. వారి రక్తమే అందుకు కారణమట.. విచిత్ర చెట్టు వివరాలు మీకోసం..!

Face Mask: కొబ్బరి చిప్పతో మాస్క్.. అదేమంటే విజిల్ కోసమట.. చివరికి పోలీసుల కంటపడటంతో..

NEET UG 2021: ఇవాళ దేశ వ్యాప్తంగా నీట్‌ (యూజీ) ఎంట్రెన్స్ టెస్ట్.. పరీక్షలో స్వల్ప మార్పులు.. పూర్తి వివరాలు మీకోసం..