CM Jagan: అక్కా చెల్లెమ్మలకు తోడుగా.. వైఎస్సార్‌ తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌ వాహనాలను ప్రారంభించిన సీఎం జగన్‌..

YSR Tallibidda Express: విజయవాడలో ‘డాక్టర్‌ వైఎస్సార్‌ తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌’ వాహనాలను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు. విజయవాడలోని బెంజ్‌ సర్కిల్‌ వేదికగా శుక్రవారం సీఎం జగన్ జెండా ఊపి ఈ వాహనాలను ప్రారంభించారు.

CM Jagan: అక్కా చెల్లెమ్మలకు తోడుగా.. వైఎస్సార్‌ తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌ వాహనాలను ప్రారంభించిన సీఎం జగన్‌..
Dr Ysr Tallibidda Express

Updated on: Apr 01, 2022 | 11:40 AM

విజయవాడలో ‘డాక్టర్‌ వైఎస్సార్‌ తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌’ (YSR Tallibidda Express)వాహనాలను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి(CM Jagan) ప్రారంభించారు. విజయవాడలోని బెంజ్‌ సర్కిల్‌ వేదికగా శుక్రవారం సీఎం జగన్ జెండా ఊపి ఈ వాహనాలను ప్రారంభించారు. ప్రభుత్వాస్పత్రిలో ప్రసవానంతరం తల్లీబిడ్డను సురక్షితంగా, సౌకర్యవంతంగా ఇంటికి చేర్చే బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇందుకోసం 500 ‘డాక్టర్‌ వైఎస్సార్‌ తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌’ వాహనాలను ప్రారంభించారు. అరకొరగా ఉన్న పాత వాహనాల స్థానంలో 500 కొత్త వాహనాలను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ.. ఈ రోజు మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నామన్నారు. అక్కచెల్లెమ్మల కోసం అత్యాధునిక వాహనాలను అందుబాటులోకి తెచ్చినట్లుగా ప్రకటించారు. ఆస్పత్రుల్లో నాణ్యమైన సేవలు అందించేలా చర్యలు చేపడుతున్నామన్నారు. అక్కా చెల్లెమ్మలకు తోడుగా ఉండేందుకే ఈ వాహనాలను ప్రారంభిస్తున్నట్లుగా వెల్లడించారు.

గతంలో అరకొర వసతులతో వాహనాలు ఉండేవి. గర్భిణీ స్త్రీలు వెళ్లే వాహనాలు మధ్యలో వాహనాలు నిలిచిపోయాయి. మెరుగైన సేవలు అందించి అధునాతన వాహనాలు ప్రవేశపెడుతున్నామన్నారు. గతంలో వాహనాలు అరకొరగా ఉండేవి.. వసతులు కూడా సరిగా ఉండేవి కావని.. అయితే ఇప్పుడు నాడు-నేడుతో ప్రభుత్వ ఆస్పత్రుల రూపురేఖలు మారుతున్నాయని సీఎం జగన్‌ అభిప్రాయపడ్డారు.

ఈ కార్యక్రమంలో మంత్రులు ఆళ్ల నాని, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కొడాలి నాని, వెల్లంపల్లి శ్రీనివాస్, శంకర నారాయణ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.


ఇవి కూడా చదవండి: Rahul Gandhi: ముందస్తు ఎన్నికలు వస్తున్నాయి.. రాహుల్‌ పర్యటనలో ఆంతర్యం అదే..

Skin Care Tips: వేసవిలో మొటిమలు, జిడ్డు చర్మంతో ఇబ్బంది పడుతున్నారా.. శ్రీ గంధంతో ఇలా చెక్ పెట్టండి..