Andhra Pradesh: అన్ని జిల్లాల్లో మెడికల్ హబ్స్.. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్.. సీఎం జగన్ కీలక నిర్ణయం

|

Aug 18, 2022 | 6:41 AM

రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ (Arogya Shri) పథకం అమలుపై ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి (CM Jagan) కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రస్తుతం ఉన్న చికిత్స విధానాలను పెంచాలని ఆదేశించారు. కొత్తగా అందిస్తున్న 754 రకాల సేవలతో పాటు ప్రస్తుతం...

Andhra Pradesh: అన్ని జిల్లాల్లో మెడికల్ హబ్స్.. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్.. సీఎం జగన్ కీలక నిర్ణయం
Ys Jagan
Follow us on

రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ (Arogya Shri) పథకం అమలుపై ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి (CM Jagan) కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రస్తుతం ఉన్న చికిత్స విధానాలను పెంచాలని ఆదేశించారు. కొత్తగా అందిస్తున్న 754 రకాల సేవలతో పాటు ప్రస్తుతం అందిస్తున్న మొత్తం సేవలు 3,118కి చేరాయని వెల్లడించారు. నూతన విధానాలు సెప్టెంబర్‌ 5 నుంచి అమలులోకి వస్తాయని పేర్కొన్నారు. పార్వతీపురం మన్యం జిల్లాలోనూ మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేయాలని, జిల్లాల్లో ఉండే ప్రభుత్వ ఆస్పత్రులు, సీహెచ్‌సీ, పీహెచ్‌సీలు, విలేజ్‌ క్లినిక్‌లు అన్నింటినీ మెడికల్‌ కాలేజీ పరిధిలోకి తీసుకురావాలని సూచించారు. దీంతో వైద్య, పరిపాలన మెడికల్‌ కాలేజీల పరిధిలోకి వస్తాయి. అంతే కాకుండా ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌ను సమర్థవంతంగా అమలు చేయాలని సీఎం జగన్ చెప్పారు. ఇకపై కమ్యూనిటీ హెల్త్‌ ఆఫీసర్లుగా మిడ్‌లెవల్‌ హెల్త్‌ ప్రొవైడర్లు అందుబాటులో ఉంటారని వివరించారు. పీహెచ్‌సీలు-మొబైల్‌ మెడికల్‌ యూనిట్ల మ్యాపింగ్‌ పూర్తయిందని, ఇప్పటికే 656 ఎంఎంయూలు పనిచేస్తున్నాయని అధికారులు ముఖ్యమంత్రికి వెల్లడించారు. మరో 432 ఎంఎంయూలు సమకూరుస్తున్నామని చెప్పారు.

ప్రతి విలేజ్‌ క్లినిక్‌లో ముగ్గురు నుంచి నలుగురు సిబ్బంది ఉంటారు. మిడ్‌ లెవల్‌ హెల్త్‌ ప్రొవైడర్‌, ఒక ఏఎన్‌ఎం, ఒకరు లేదా ఇద్దరు ఆశావర్కర్లు ఉంటారు. విలేజ్‌ క్లినిక్స్‌లో 67 రకాల మందులు, 14 రకాల పరీక్షలు అందుబాటులో ఉంటాయి. రాష్ట్రవ్యాప్తంగా 27 హబ్స్‌ ఏర్పాటు చేయాలి. మెడికల్‌ హబ్స్‌ను అన్ని జిల్లాల వైద్యకళాశాలల్లో ఏర్పాటుచేయాలి. ఈ మెడికల్‌ హబ్స్‌ నుంచి చికిత్సలకు అవసరమైన సలహాలు, సూచనలు వైద్యులకు వస్తాయి.

– వైఎస్.జగన్మోహన్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి

ఇవి కూడా చదవండి

కాగా.. ఆరోగ్యశ్రీ ద్వారా అందించే చికిత్సలను పెంచాలని ముఖ్యమంత్రి జగన్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఆరోగ్యశ్రీ లబ్ధిదారులకు వర్చువల్‌ బ్యాంకు ఖాతాలు తెరిచి, చికిత్సకు అయ్యే ఖర్చును ఆ ఖాతాలోనే జమ చేయాలని చెప్పారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..