Chiken Rates: అమ్మ బాబోయ్.. కొండెక్కిన కోడి.. కేజీ చికెన్ ధర ఎంత తెల్సా..?

హాయ్.. ఇవాళ సండే కదా మీరు చికెన్ తెచ్చుకున్నారా..? ధర చూసి కంగుతిన్నారా..? అవును చికెన్ ధరలు గత వారం రోజులతో పోల్చుకుంటే రూ. 20 నుంచి రూ. 30 వరకు పెరిగాయి. కరోనా వ్యాప్తి నేపథ్యంలో జనం నిరోధక శక్తి కోసం చికెన్ ఎక్కువగా తింటూ ఉండటంతో డిమాండ్ పెరిగింది.

Chiken Rates: అమ్మ బాబోయ్.. కొండెక్కిన కోడి.. కేజీ చికెన్ ధర ఎంత తెల్సా..?
Chicken

Updated on: Jun 01, 2025 | 4:49 PM

నాన్ వెజ్ ప్రియులకు షాకింగ్ న్యూస్. తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు కొండెక్కాయి.  గత కొన్ని రోజులుగా చికెన్ ధరలు అమాంతం పెరిగిపోయాయి. ప్రస్తుతం హైదరాబాద్, విజయవాడ, వరంగల్, విశాఖపట్నం వంటి నగరాల్లో కిలో చికెన్ ధర రూ. 260 నుంచి రూ. 280 మధ్య ఉంది. వారం రోజుల్లోనే ధర సుమారు 20-30 రూపాయలు పెరిగినట్లు చెబుతున్నారు. డిమాండ్ ఎక్కువగా ఉన్న కొన్ని ప్రాంతాల్లో ఈ ధరలు మరింతగా పెరిగాయని సమాచారం.

దీంతో సండే చికెన్ తెద్దామని మార్కెట్‌కు వెళ్లిన వినియోగదారులు షాకవుతున్నారు. కోవిడ్-19 కేసులు మళ్లీ పెరుగుతుండటంతో, ప్రోటీన్ అవసరాల కోసం చికెన్, గుడ్లకు డిమాండ్ గణనీయంగా పెరిగినట్టు తెలుస్తోంది. శరీర రోగనిరోధక శక్తిని మెరుగుపర్చుకునే ప్రయత్నంలో ప్రజలు చికెన్‌ను మరింతగా ప్రాధాన్యంగా తీసుకుంటున్నారు. ఈ డిమాండ్‌ను అడ్డుగా పెట్టుకుని కొంతమంది వ్యాపారులు ధరలను పెంచుతున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి.

బ్రాయిలర్ కోళ్ల పెంపకానికి అయ్యే ఖర్చులు, దాణా వ్యయాలు, రవాణా ఖర్చులు కూడా ఈ ధరల పెరుగుదలలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఆదివారం రోజున, పలు చికెన్ షాపుల ముందు భారీ క్యూలు కనిపించాయి.

కాగా రేట్లు పెరగడంతో ఆదివారం మెనూలో చికెన్‌ను భాగం చేసుకునే మధ్యతరగతి కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ప్రజల డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ధరల నియంత్రణ చర్యలు తీసుకోవాలని వినియోగదారులు విజ్ఞప్తి చేస్తున్నారు. అయినా, కొందరు ధరలపై దృష్టి పెట్టకుండా, అవసరాన్ని బట్టి కొనుగోలు చేస్తూనే ఉన్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..