Chenetha challenge: కేటీఆర్ ఛాలెంజ్ స్వీకరించిన జనసేనాని.. ఆశ్చర్యకరంగా ఆ 3 ముగ్గుర్ని నామినేట్ చేసిన పవన్

|

Aug 07, 2022 | 12:23 PM

ఈ ఆదివారం జాతీయ చేనేత దినోత్సవం. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖుల మధ్య చేనేత ఛాలెంజ్ నడుస్తుంది. ఆ విశేషాలు మీ కోసం.

Chenetha challenge: కేటీఆర్ ఛాలెంజ్ స్వీకరించిన జనసేనాని.. ఆశ్చర్యకరంగా ఆ 3 ముగ్గుర్ని నామినేట్ చేసిన పవన్
Pawan Kalyan Ktr
Follow us on

జాతీయ చేనేత దినోత్సవం రోజున.. నేతల మధ్య ఛాలెంజ్‌లు రక్తికట్టిస్తున్నాయి. తెలంగాణ మంత్రి కేటీఆర్‌ ట్విటర్ వేదికగా ముగ్గురికి ఛాలెంజ్ విసిరారు. ఆనంద్ మహీంద్రా, సచిన్ టెండూల్కర్‌, పవన్‌ కల్యాణ్‌లు చేనేత వస్త్రాలు ధరించి ఫోటోలు పోస్ట్ చేయాలని ఛాలెంజ్‌ చేశారు. మంత్రి కేటీఆర్‌ ఛాలెంజ్‌ స్వీకరించారు జనసేనాని పవన్ కల్యాణ్‌. రామ్‌ భాయ్‌ ఛాలెంజ్ స్వీకరించా అంటూనే టీడీపీ అధినేత చంద్రబాబు, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి, బీజేపీ ఎంపీ లక్ష్మణ్‌ను నామినేట్ చేశానంటూ ట్వీట్‌ చేశారు. దీనికి థ్యాంక్స్‌ పవన్ కల్యాణ్‌ అన్న అని రిప్లయ్‌ ఇచ్చారు మంత్రి కేటీఆర్‌. చేనేత బంధం.. ట్వీట్లకు రీట్వీట్లు.. అంతా బాగానే ఉంది. అయితే పవన్‌ కల్యాణ్‌.. చంద్రబాబుకి ఛాలెంజ్‌ విసరడం టాక్ ఆఫ్‌ ది తెలుగు స్టేట్స్‌గా మారిపోయింది. ఏపీలో టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకోవడం ఖాయమన్న వార్తలు చాలారోజులుగా వినిపిస్తున్నాయి. ఆ మధ్య కుప్పం పర్యటనలో చంద్రబాబు వన్‌ సైడ్‌ లవ్ కామెంట్స్ చేశారు. జనసేనతో పొత్తుకి సిద్ధమని పరోక్షంగా సంకేతాలిచ్చారు. ఆ తర్వాత పవన్‌ కూడా పాజిటివ్‌గానే స్పందించారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకూడదని.. విపక్షాలన్నీ ఒక్కతాటిపైకి రావాలన్నారు. పొత్తుకి సిద్ధమేనన్నది ఇద్దరి అభిమతంగా కనిపించింది.

పొత్తుల ఎత్తులు.. మనసులో మాటలు.. ముందు ముందు ఏ వైపు టర్న్ అవుతాయో తెలియదు. కానీ పవన్‌.. చంద్రబాబుకి చేనేత ఛాలెంజ్ విసరడం మాత్రం హాట్‌ టాపిక్‌గా మారింది. పవన్ ఛాలెంజ్ చేశారు. మరి చంద్రబాబు ఏం చేయబోతున్నారు. చాలా ఏళ్లుగా చంద్రబాబు చేనేత కోవకు చెందిన దుస్తుల్నే వాడుతున్నారు. మరిప్పుడు పవన్ ఛాలెంజ్‌కి ఎలా రిప్లయ్ ఇస్తారన్నది ఇంట్రెస్టింగ్ విషయం.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి