Fake AP Secretary Employee: ఏపీ సీఎం జగన్ పేషీ ఉద్యోగినంటూ ఘరానా మోసం .. ఓ వ్యాపారికి కుచ్చుటోపీ

ఏపీ సీఎం జగన్ పేషీ పేరుతో ఘరానా మోసం చోటు చేసుకుంది. సీఎం పేషీ ఉద్యోగినంటూ ఓ వ్యాపారికి కుచ్చుటోపీ పెట్టారు గుర్తు తెలియని దుండగులు...

Fake AP Secretary Employee: ఏపీ సీఎం జగన్ పేషీ ఉద్యోగినంటూ ఘరానా మోసం .. ఓ వ్యాపారికి కుచ్చుటోపీ

Edited By:

Updated on: Feb 01, 2021 | 9:06 AM

Fake AP Secretary Employee: ఏపీ సీఎం జగన్ పేషీ పేరుతో ఘరానా మోసం చోటు చేసుకుంది. సీఎం పేషీ ఉద్యోగినంటూ ఓ వ్యాపారికి కుచ్చుటోపీ పెట్టారు గుర్తు తెలియని దుండగులు. ప్రభుత్వం చేపట్టిన పథకంలో భాగంగా పాఠశాలలకు కర్టెన్లు, వాల్ పేపర్లు టెండర్లంటూ కొంత మంది కేటుగాళ్లు వ్యాపారి తొండెపు చంద్రశేఖర్ ను బురిడీ కొట్టించిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. టెండర్ పేరుతో వ్యాపారి చంద్రశేఖర్ నుండి 40 వేలు కాజేశారు. వ్యాపారికి ప్రదీప్, సురేష్ అనే తప్పుడు పేర్లతో ఫేక్ కాల్స్ ద్వారా చీటింగ్ చేసినట్లు తెలుస్తోంది. బాధితుడు తాను మోసపోయిన విషయం గుర్తించి వెంటనే గవర్నర్ పేట పోలీసులను ఆశ్రయించాడు. సీఎం‌ పేషీ ఎకౌంట్ సెక్షన్ పేరుతో జరిగిన మోసం పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: మయన్మార్‌లో రాజకీయ సంక్షోభం.. అంగ్ సాన్ సూకీ, ప్రముఖ వ్యక్తులను అదుపులోకి తీసుకున్న సైనికులు