Chandrababu Arrest: నేటితో ముగియనున్న చంద్రబాబు రిమాండ్‌ గడువు.. ఇవాళ ఏం జరగనుంది..?

Chandrababu Naidu Arrest: స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసు ఏపీ రాజకీయాలను కుదిపేస్తోంది. ప్రతిపక్షపార్టీ టీడీపీ.. అధికార పార్టీ వైసీపీ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఈ క్రమంలో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో చంద్రబాబు నాయుడు రిమాండ్‌ గడువు నేటితో ముగియనుంది. ప్రస్తుతం రాజమండ్రి జైలులో ఉన్న చంద్రబాబును.. విజయవాడ ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ముందు వర్చువల్‌గా హాజరుపరిచే అవకాశం ఉంది.

Chandrababu Naidu Arrest: స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసు ఏపీ రాజకీయాలను కుదిపేస్తోంది. ప్రతిపక్షపార్టీ టీడీపీ.. అధికార పార్టీ వైసీపీ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఈ క్రమంలో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో చంద్రబాబు నాయుడు రిమాండ్‌ గడువు నేటితో ముగియనుంది. ప్రస్తుతం రాజమండ్రి జైలులో ఉన్న చంద్రబాబును.. విజయవాడ ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ముందు వర్చువల్‌గా హాజరుపరిచే అవకాశం ఉంది. మొదటి రిమాండ్‌ ముగిసిన తర్వాత చంద్రబాబును..న్యాయమూర్తి ఎదుట వర్చువల్‌లో హాజరుపరిచారు. అప్పుడు రెండ్రోజులు సీఐడీ కస్టడీకి అనుమతించడంతో జైలులోనే అధికారులు విచారించారు. ఆ తర్వాత కూడా వర్చువల్‌లోనే న్యాయమూర్తి ఎదుట హాజరుపరచగా అక్టోబరు 5 వరకు రిమాండ్‌ విధించారు. చంద్రబాబు బెయిల్‌, కస్టడీ పిటీషన్లపై ఏసీబీ కోర్టులో నేడు కూడా వాదనలు కొనసాగనున్నాయి. అనంతరం ఏసీబీ కోర్టు తీర్పును వెల్లడించనుంది.  మొత్తంగా..ఇవాళ రిమాండ్ గడువు ముగియనున్న నేపథ్యంలో.. చంద్రబాబుకు కోర్టు మళ్లీ రిమాండ్ విధిస్తుందా..? కస్టడీకి ఇస్తుందా..? లేకపోతే బెయిల్ మంజూరు చేస్తుందా..? అనేది ఉత్కంఠ నెలకొంది. రిమాండ్ గడువు, బెయిల్ పిటీషన్లపై ఇవాళ సాయంత్రం ఏసీబీ కోర్టు న్యాయమూర్తి నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది.

ఇక ఫైబర్‌ గ్రిడ్‌ కేసులో ముందస్తు బెయిలు కోసం చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టులో నిన్న వాదనలు జరిగాయి. పిటిషనర్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది సిద్ధార్థ అగర్వాల్‌ వాదనలు వినిపించారు. టెరాసాఫ్ట్‌ సంస్థకు టెండర్‌ ఖరారు విషయంలో సాంకేతిక కమిటీ, టెండర్‌ అవార్డు కమిటీలో చంద్రబాబు సభ్యుడిగా లేరని కోర్టుకు తెలిపారు. విధానపరమైన నిర్ణయాల అమలులో కొందరు చేసిన తప్పులకు..నాటి సీఎంను బాధ్యుడిని చేయడం సరికాదన్నారు. రాజకీయ కారణాలతోనే పిటిషనర్‌ను కారాగారంలో ఉంచాలని ప్రభుత్వం భావిస్తోందని ఆరోపించారు. అయితే పూర్తిస్థాయి వాదనలు వినేందుకు తగిన సమయం లేకపోవడంతో విచారణను వాయిదా వేస్తున్నట్లు న్యాయమూర్తి ప్రకటించారు. ఇక స్కిల్‌డెవలప్‌మెంట్‌ కేసులో నారా లోకేశ్‌ను అరెస్టు చేయొద్దంటూ ఇటీవల ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను హైకోర్టు ఈ నెల 12 వరకూ పొడిగించింది. మరోవైపు నారా లోకేష్‌ నేడు ఢిల్లీనుంచి ఏపీ చేరుకోనున్నారు. చంద్రబాబు బెయిలు పిటిషన్‌పై ఏసీబీ కోర్టులో సానుకూల నిర్ణయం రాకపోతే..చంద్రబాబుతో రేపు లోకేష్‌ ములాఖత్‌ అవుతారని నేతలు చెబుతున్నారు.

మరోవైపు నారా లోకేష్‌ నేడు ఢిల్లీనుంచి ఏపీ చేరుకోనున్నారు. రాజమండ్రిలో జైలులో ఉన్న చంద్రబాబుతో లోకేష్‌ రేపు ములాఖత్ అవుతారని పార్టీవర్గాలు చెబుతున్నాయి. లోకేశ్‌ దాదాపు మూడు వారాలుగా ఢిల్లీలోనే ఉన్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..