AP High Court: అంగళ్లు కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్‌‌పై విచారణ వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే ?

|

Sep 14, 2023 | 12:41 PM

అంగళ్లు కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది. అన్నమయ్య జిల్లా అంగళ్లు ఘటనలో పోలీసులు తనపై నమోదు చేసిన కేసులో బెయిల్‌ కోరుతూ చంద్రబాబు పిటీషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు.. స్పందించింది. ఈ కేసుకు సంబంధించిన విచారణను ఈ నెల 20వ తేదీకి వాయిదా వేస్తూ తీర్పునిచ్చింది. అయితే కేసుకు సంబంధించి పూర్తి వివరాలతో హాజరు కావాలని పోలీసులను హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

AP High Court: అంగళ్లు కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్‌‌పై విచారణ వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే ?
Chandrababu
Follow us on

అంగళ్లు కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది. అన్నమయ్య జిల్లా అంగళ్లు ఘటనలో పోలీసులు తనపై నమోదు చేసిన కేసులో బెయిల్‌ కోరుతూ చంద్రబాబు పిటీషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు.. స్పందించింది. ఈ కేసుకు సంబంధించిన విచారణను ఈ నెల 20వ తేదీకి వాయిదా వేస్తూ తీర్పునిచ్చింది. అయితే కేసుకు సంబంధించి పూర్తి వివరాలతో హాజరు కావాలని పోలీసులను హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. చంద్రబాబు తరఫున న్యాయవాదులు వాయిదా కోరడంతో న్యాయస్థానం ఈ నిర్ణయం తీసుకుంది. ఇదిలా ఉండగా.. గత నెల 4న చంద్రబాబు నీటి ప్రాజెక్టుల సందర్శనకు వెళ్తున్న సమయంలో అన్నమయ్య జిల్లా అంగళ్లు వద్ద టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. వైసీపీ పార్టీ కార్యకర్తలు తమ పార్టీ కార్యకర్తలపై రాళ్లు విసిరారని చంద్రబాబు నాయుడు పిటిషన్‌ వేశారు. తన సెక్యూరిటీ సిబ్బంది కాపాడారంటూ పిటిషన్‌లో పేర్కొన్నారు.

అయితే ఈ ఘర్షణలు చోటుచేసుకున్న నేపథ్యంలో పోలీసులు 179 మందిపై కేసు నమోదు చేశారు. ఇందులో చంద్రబాబును ఏ1 గా చేర్చారు. ఇందులో హత్యాయత్నంతో సహా.. పలు సెక్షన్ల కింద అన్నమయ్య జిల్లా కురబలకోట మండలం ముదివేడు పోలీసులు ఈ కేసులు నమోదు చేశారు. వాస్తవానికి సాగునీట ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్ధభేరి పేరిట గత నెలన అన్నమయ్య జిల్లాలో చంద్రబాబు నాయుడు పర్యటించారు. ఆ సమయంలో ఆయన అంగళ్లు మీదుగా వెళ్తున్నప్పుడు.. టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య ఏర్పడిన వివాదం.. తీవ్ర ఉద్రిక్తతలు దారితీసింది. దీంతో మొదటగా పోలీసులు 20 మంది టీడీపీ నాయకుల పేర్లను ప్రస్తావించారు. అలాగే ఇతరుల కింద మరో 159 మందిపై కేసులు నమోదు చేశారు. అయితే ఇందులో 139 మంది పీలేరు నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. అయితే ఇప్పుడు స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబును రిమాండ్ కోసం రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించిన సంగతి తెలిసిందే.

ఇదిలా ఉండగా.. ఈరోజు జనసేన అధినేత పవన్ కల్యాణ్, బాలకృష్ణ, నారా లోకేష్ చంద్రబాబుతో ములాఖత్‌కు వెళ్లారు. ఎయిర్‌పోర్టు నుంచి నేరుగా పవన్ కల్యాన్ సెంట్రల్ జైలుకు చేరుకోగా.. అదే సమయంలో బాలకృష్ణ, చంద్రబాబు నాయుడు క్యాంపు నుంచి సెంట్రల్ జైలుకు వచ్చారు. అయితే ములఖాత్ తర్వాత ఈ నేతలు మీడియాతో మాట్లాడనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సెంట్రల్ జైలు వద్ద దాదాపు 300 మంది పోలీసులతో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఇప్పటికే ప్రభుత్వాసుపత్రి, ఆర్ట్స్ కళాశాలల వద్ద బారీకేడ్లు ఏర్పాటు చేసి అక్కడి నుంచి వాహనాలను మళ్లిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..