డీజీపీ గౌతమ్‌కు సవాంగ్‌కు లేఖ రాసిన చంద్రబాబు.. గురుప్రతాప్ రెడ్డి హత్య కేసులో నిందితులను శిక్షించాలని డిమాండ్..

|

Dec 11, 2020 | 4:20 PM

ఆంధ్రప్రదేశ్ డీజీపీ గౌతమ్ సవాంగ్‌కు టీడీపీ అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబు మరోసారి లేఖ రాశారు. రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న అరాచకాలపై ప్రశ్నించారు. సీఆర్‌పీఎఫ్ మాజీ కానిస్టేబుల్ గురుప్రతాప్ రెడ్డి...

డీజీపీ గౌతమ్‌కు సవాంగ్‌కు లేఖ రాసిన చంద్రబాబు.. గురుప్రతాప్ రెడ్డి హత్య కేసులో నిందితులను శిక్షించాలని డిమాండ్..
Follow us on

ఆంధ్రప్రదేశ్ డీజీపీ గౌతమ్ సవాంగ్‌కు టీడీపీ అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబు మరోసారి లేఖ రాశారు. రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న అరాచకాలపై ప్రశ్నించారు. సీఆర్‌పీఎఫ్ మాజీ కానిస్టేబుల్ గురుప్రతాప్ రెడ్డి హత్యకేసులో నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. వైసీపీ అవినీతిని బయటపెట్టినందుకే గురుప్రతాప్ రెడ్డిని దారుణంగా చంపేశారని లేఖలో చంద్రబాబు ఆరోపించారు. రాష్ట్రంలో అవినీతి శక్తుల అరాచకాలకు కళ్లెం వేయాలని డీజీపీని ఆయన డిమాండ్ చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో అరాచకాలు పెరిగిపోతున్నాయన్నారు. రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా ను నిలబెట్టాలని డీజీపీ గౌతమ్ సవాంగ్‌ను చంద్రబాబు డిమాండ్ చేశారు. కాగా, రెండు రోజుల క్రితం కూడా చంద్రబాబు రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్‌కు లేఖ రాశారు.