Special Status To AP: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వలేం… తేల్చి చెప్పిన కేంద్ర ప్రభుత్వం..

| Edited By: Ram Naramaneni

Mar 23, 2021 | 3:17 PM

Special Status To AP: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వలేలమని కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది. ఏపీ పునర్విభజన చట్టాన్ని ఏ మేరకు అమలు చేశారో కేంద్రం స్పష్టం చేయాలని తేదేపా ఎంపీ రామ్మోహన్‌ నాయుడు...

Special Status To AP: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వలేం... తేల్చి చెప్పిన కేంద్ర ప్రభుత్వం..
Special Status To Ap
Follow us on

Special Status To AP: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వలేలమని కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది. ఏపీ పునర్విభజన చట్టాన్ని ఏ మేరకు అమలు చేశారో కేంద్రం స్పష్టం చేయాలని తేదేపా ఎంపీ రామ్మోహన్‌ నాయుడు లోక్‌ సభలో ప్రశ్నించారు. ఈ అంశంపై అడిగిన లిఖితపూర్వక ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సంతృప్తికర సమాధానం ఇవ్వలేదన్నారు. అయితే దీనిపై స్పందించిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్‌ రాయ్‌ మాట్లాడుతూ.. పునర్విభజన చట్టంలోని అనేక అంశాలు రెండు తెలుగు రాష్ట్రాలు కలిసి పరిష్కరించుకోవాల్సినవి అని సమాధానమిచ్చారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేమని తేల్చి చెప్పారు. 14వ ఆర్థిక సంఘం సిఫారసు మేరకు ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడం లేదని తేల్చి చెప్పారు. ఏపీకి ప్రత్యేక ప్యాకేజీతో పాటు అనేక మినహాయింపులు ఇచ్చామని తెలిపారు. తెలుగు రాష్ట్రాల మధ్య అనేక సమస్యలున్నాయి..పరిష్కారం మా చేతుల్లో లేదని చెప్పారు. తెలుగు రాష్ట్రాలే సమస్యలు పరిష్కరించుకోవాలన్నారు.