Tirumala Laddu: తిరుమల లడ్డూ కల్తీపై కేంద్రం సీరియస్‌.. ఏఆర్‌ డెయిరీకి నోటీసులు

|

Sep 24, 2024 | 1:38 PM

తిరుపతి శ్రీవారి లడ్డూ ప్రసాదంపై దేశవ్యాప్త ఆందోళనలతో అలర్ట్‌ అయిన కేంద్రం... ఎలాంటి యాక్షన్‌కు రెడీ అయ్యింది...? సెన్సిటివ్‌ ఇష్యూని ఎలా డీల్‌ చేయనుంది.?

Tirumala Laddu: తిరుమల లడ్డూ కల్తీపై కేంద్రం సీరియస్‌.. ఏఆర్‌ డెయిరీకి నోటీసులు
Tirumala Laddu
Follow us on

వరల్డ్‌ ఫేమస్‌ శ్రీవారి లడ్డూ.. ఇప్పుడు మోస్ట్‌ బర్నింగ్‌ టాపిక్‌గా మారింది. దేశవ్యాప్తంగా తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది. పరమ పవిత్రమైన లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు వాడారంటూ పెద్దఎత్తున నిరసనలు మిన్నంటాయి. ఈ లడ్డూ వివాదం సుప్రీంకోర్టును కూడా తాకింది. గత పాలకుల వైఫల్యమేనంటూ ఏపీ ప్రభుత్వం కన్నెర్ర చేస్తూనే ఉంది. సీఎం చంద్రబాబు సైతం ఆగ్రహావేశాలు వెల్లగక్కారు. పామాయిల్‌ కూడా రాని రేటుకు నెయ్యి ఎలా వచ్చిందంటూ మండిపడ్డారు.

లడ్డూ తయారీపై ఏపీ ప్రభుత్వ విమర్శలు, దేశవ్యాప్త ఆందోళనలతో కేంద్ర ప్రభుత్వం అలర్ట్‌ అయ్యింది. కల్తీ నెయ్యి సరఫరా చేసిన కంపెనీలపై సీరియస్‌ అయ్యింది. ఇక కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో రంగంలోకి దిగిన FSSAI… టీటీడీకి నెయ్యి సరఫరా చేసిన తమిళనాడుకు చెందిన ఏఆర్‌ డెయిరీకి నోటీసులిచ్చి వివరణ ఇవ్వాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది.

ఇటు ఏఆర్‌ డెయిరీ మాత్రం.. ఎలాంటి కల్తీకి పాల్పడలేదంటోంది. మంచి నెయ్యినే పంపించామని.. క్వాలిటీ చెక్‌ చేశాకే కంపెనీ నుంచి నెయ్యి వెళ్లిందంటోంది. ఎలాంటి న్యాయ విచారణకైనా సిద్ధమంటూ ఇప్పటికే స్టేట్‌మెంట్‌ ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఏఆర్‌ డెయిరీకి FSSAI నోటీసులివ్వడం చర్చనీయాంశమైంది. మరి చూడాలి నెయ్యి కల్తీపై ఎలాంటి రిపోర్ట్‌ వస్తుందో.!

ఇది చదవండి: రాగల మూడు గంటలు భారీ వర్షాలు.. ఈ ప్రాంతాలకు హైఅలెర్ట్

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి