Srisailam Temple: శ్రీశైలంలో పర్యటిస్తున్న టూరిజం సెంట్రల్ కమిటీ.. ఆలయ అభివృద్ధి పనుల పరిశీలన..

భారత ప్రభుత్వ పర్యాటక మంత్రిత్వ శాఖ డైరెక్టర్ జనరల్ మీనాక్షి శర్మ నేతృత్వంలోని అధికారుల శ్రీశైలంలో పర్యటించింది.

Srisailam Temple: శ్రీశైలంలో పర్యటిస్తున్న టూరిజం సెంట్రల్ కమిటీ.. ఆలయ అభివృద్ధి పనుల పరిశీలన..

Edited By:

Updated on: Dec 20, 2020 | 1:07 PM

Srisailam Temple: భారత ప్రభుత్వ పర్యాటక మంత్రిత్వ శాఖ డైరెక్టర్ జనరల్ మీనాక్షి శర్మ నేతృత్వంలోని అధికారుల శ్రీశైలంలో పర్యటించింది. శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్లను వారు దర్శించుకున్నారు. ఆ సందర్భంగా ఆలయ అధికారులు వారికి ఘన స్వాగతం పలికారు. దర్శన ఏర్పాట్లు చేశారు. కాగా, ఈ బృందం పర్యటనలో భాగంగా శ్రీశైలం పుణ్యక్షేత్రంలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను పరిశీలించనున్నారు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రసాదం పథకం కింద శ్రీశైల క్షేత్రానికి మంజూరు చేసిన నిధులతో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను వారు పరిశీలిస్తారు. ఈ అధికార బృందం ఇవాళ అంతా శ్రీశైలం మహాక్షేత్రంలోనే పర్యటించనున్నారు. కాగా, దేశ వ్యాప్తంగా ప్రముఖ దేవాలయాల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ప్రసాదం పథకం కింద నిధులను ఏటా మంజూరు చేస్తోంది. ఈ నిధులతో ఆయా ఆలయాల్లో అధికారులు అభివృద్ధి పనులు చేపడుతారు.

 

Also read:

బీజేపీకి షాక్… మహబూబ్‌నగర్ జిల్లా అధ్యక్ష పదవికి మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ రాజీనామా….

కోవిడ్ రెండో డోసు వ్యాక్సిన్ తీసుకోకండి, అలెర్జీ రోగులకు అమెరికన్ హెల్త్ సంస్థ హెచ్ఛరిక, ఖచ్చితమైన గైడ్ లైన్స్ జారీ

Loading...
Unable to load recommendations.
Follow Us