Best Teachers 2021: సర్వ విద్యా ప్రదాతలు.. తెలుగు రాష్ట్రాల చిన్నారులకు ముద్దుల గురువులు ఈ నలుగురు

|

Aug 18, 2021 | 5:24 PM

జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల జాబితా 2021ను కేంద్రం ప్రకటించింది. దేశవ్యాప్తంగా 44 మంది ఉపాధ్యాయులకు ఈ ఏడాది ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు అనౌన్స్ చేశారు. ఆంధ్రప్రదేశ్‌ నుంచి

Best Teachers 2021: సర్వ విద్యా ప్రదాతలు.. తెలుగు రాష్ట్రాల చిన్నారులకు ముద్దుల గురువులు ఈ నలుగురు
Best Teachers
Follow us on

Best Teachers: జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల జాబితా 2021ను కేంద్రం ప్రకటించింది. దేశవ్యాప్తంగా 44 మంది ఉపాధ్యాయులకు ఈ ఏడాది ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు అనౌన్స్ చేశారు. ఆంధ్రప్రదేశ్‌ నుంచి ఇద్దరికి, తెలంగాణ నుంచి ఇద్దరికి ఈ అత్యున్నత అవార్డు దక్కింది. ఉత్తమ ఉపాధ్యాయుల జాబితాలో కొణతాల ఫణిభూషణ్ శ్రీధర్ (ఏపీ), ఎస్. ముని రెడ్డి (ఏపీ), కే. రంగయ్య (తెలంగాణ), పయ్యావుల రామస్వామి (తెలంగాణ) ఉన్నారు.

వచ్చిన దరఖాస్తులను పరిశీలించిన మీదట భారత ప్రభుత్వం మెరిట్ ఆధారంగా ఉత్తమ ఉపాధ్యాయుల తుది ఎంపిక చేస్తుంది. ఈ అవార్డులో మెడల్, సర్టిఫికెట్ ఇంకా రూ. 25,000/ నగదు ప్రైజ్ మనీగా చెల్లిస్తారు. కాగా, కేంద్రం ప్రతి ఏటా జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులను ప్రకటించడం ఆనవాయితీగా వస్తోంది.

గతేడాది దేశవ్యాప్తంగా 47 మందిని జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు ఎంపిక చేసింది. ఆ జాబితాలో తెలుగు రాష్ట్రాల నుంచి ఇద్దరికి చోటు లభించింది. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ జెడ్పీ పాఠశాల ఉపాధ్యాయుడు మధుబాబు.. హైదరాబాద్‌లోని మలక్‌పేట పాఠశాల ఉపాధ్యాయురాలు పద్మప్రియలకు గతేడాది 2020 ఉత్తమ పురస్కారం దక్కింది.

Read also: Manuguru: మణుగూరు ఓపెన్‌ కాస్ట్‌ బొగ్గు గనిలో ఘోరాతి ఘోరం, బొలెరో వాహనంపైకి ఎక్కిన డంపర్