AP: పాత భూ రికార్డులు తారుమారు.. చిత్తూరు జిల్లాలో నలుగురు అధికారులపై కేసు నమోదు..

|

Jan 17, 2022 | 11:56 AM

పాత భూ రికర్డులు తారుమారు కేసులో అధికారులపై కేసులు నమోదు. చిత్తూరు జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. వేటు పడటమే కాకుండా ఇద్దరు తహశీల్ధార్లపై కేసులు..

AP: పాత భూ రికార్డులు తారుమారు.. చిత్తూరు జిల్లాలో నలుగురు అధికారులపై కేసు నమోదు..
Bhoo Kabhja
Follow us on

Records Tampering Case: పాత భూ రికర్డులు తారుమారు కేసులో అధికారులపై కేసులు నమోదు. చిత్తూరు జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. వేటు పడటమే కాకుండా ఇద్దరు తహశీల్ధార్లపై కేసులు కూడా నమోదు చేశారు. భూ రికార్డుల తారుమారు కేసులోని పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. చిత్తూరు జిల్లా వరదయ్యపాలెం మండలం చిన్న పాండూరులో నిబంధనలకు విరుద్ధంగా పట్టాలు మంజూరు చేసిన ఇద్దరూ తహసీల్దార్లు ఇద్దరు ఆర్ ఐ లతోపాటు ఇద్దరు విఆర్ఓలపై కేసు నమోదు చేశారు. వీరిపై తిరుపతి ఆర్ డి వో కనకనరసా రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు పోలీసులు.

నాలుగు ఎకరాల డికేటి భూమిని నిబంధనలకు విరుద్ధంగా రెవిన్యూ రికార్డుల్లో పేర్లు తారుమారు  చేశారు. అనంతరం చిన్న పాండ్ ఊరు వద్ద అపోలో పరిశ్రమకు కేటాయించిన రెండు వందల నలభై ఎకరాల భూమికి సంబంధించి బాధితులకు పరిహారం అందకపోవడంతో ఆ బాధిత రైతులు హైకోర్టును ఆశ్రయించారు.దీంతో పట్టాల మంజూరులో నిబంధనలు పాటించక పోవడాన్ని కోర్టు తప్పుబట్టింది.

2012-15 మధ్య కాలంలో జరిగిన ఈ వ్యవహారంపై జిల్లా కలెక్టర్ విచారణ జరిపారు. కలెక్టర్ జరిపిన విచారణలో రికార్డులు తారుమారు అయినట్లు తేలడంతో చర్యలు తీసుకున్నారు. అప్పట్లో తహసిల్దార్లు గా పనిచేసిన మహదేవయ్య బాబు, రాజేంద్ర ప్రసాద్, ఆర్ ఐ లు సదాశివయ్య మురళీమోహన్ హం విఆర్వోలు రఘునాథరెడ్డి వెంకటరమణయ్యలపై కేసులు నమోదు చేశారు.

ఇప్పటికే తాసిల్దార్ గా పనిచేసిన మహదేవయ్యతో పాటు ఇద్దరు ఆర్ ఐ లు, మరో వి ఆర్ ఓ లు రిటైర్డ్ కాగా బాబు రాజేంద్రప్రసాద్ మాత్రం గుడిపాల తహసీల్ధార్ గా పనిచేస్తున్నారు.

ఇవి కూడా చదవండి: Pandit Birju Maharaj: ఆ సవ్వడి ఇక వినిపించదు.. ప్రముఖ కథక్ నృత్యకారుడు పండిట్ బిర్జు మహారాజ్‌‌కు గుండెపోటు

Glowing Skin : చలికాలంలో మెరిసే చర్మం కోసం.. ఈ వింటర్ సూపర్ ఫుడ్స్.. మీ డైట్‌లో చేర్చుకోండి