AP News: ఇద్దరు భార్యలు… ఏడుగురు పిల్లలు.. రెండిళ్ళు మెయింటైన్ చేయలేక…

| Edited By: Ram Naramaneni

Dec 04, 2024 | 7:49 PM

అతనికి ఇద్దరు భార్యలు ఉన్నారు... ఏడుగురు పిల్లలు.. చేసేది కార్పెంటర్ జాబ్. దీంతో ఫ్యామిలీ పోషించడం కష్టతరంగా మారింది. దీని కొత్త ఎత్తు వేశాడు..

AP News: ఇద్దరు భార్యలు... ఏడుగురు పిల్లలు.. రెండిళ్ళు మెయింటైన్ చేయలేక...
Thief
Follow us on

తాళాలు వేసి ఉన్న ఇళ్లే టార్గెట్‌గా ఓ దొంగల ముఠా అనంతపురం జిల్లాతో పాటు ఆంధ్రప్రదేశ్‌లో అనేక చోట్ల దోపిడీలకు పాల్పడింది. ముఖ్యంగా అనంతపురం జిల్లాలో వరుస దొంగతనాలపై పోలీసులు సీరియస్‌గా దృష్టి పెట్టారు. దొంగల ముఠా.. తాళాలు వేసి ఉన్న ఇళ్లనే టార్గెట్‌గా చేసుకొని దోపిడీలకు పాల్పడుతున్నట్లు గుర్తించిన పోలీసులు.. దొంగల ముఠా కోసం మాటు వేశారు. ధర్మవరంకు చెందిన ముగ్గురు సభ్యుల అంతర్రాష్ట్ర దొంగల ముఠాను ఎట్టకేలకు అనంతపురం పోలీసులు పట్టుకున్నారు. ప్రధాన నిందితుడు షేక్ కాజా… మరో ఇద్దరితో కలిసి ముఠాగా ఏర్పడి దొంగతనాలు చేయడం ప్రారంభించాడు. ఇందులో ఆసక్తికరమైన విషయం ఏంటంటే ప్రధాన నిందితుడు షేక్ కాజా వృత్తి పెయింటర్. షేక్ కాజాకు ఇద్దరు భార్యలు… ఏడుగురు పిల్లలు. దీంతో పెయింటింగ్ పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషించడం కష్టమవడంతో… ఈజీ మనీ కోసం దొంగతనాన్ని మార్గంగా ఎంచుకున్నాడు. సింపుల్ గా చెప్పాలంటే రెండిళ్లు మెయింటైన్ చేయలేక… దొంగగా మారాడు.

పగలంతా ఇళ్లకు.. షాపులకు పెయింటింగ్ వేస్తూ రెక్కీ నిర్వహించే షేక్ కాజా… చీకటి పడగానే తన ముఠాతో ఇళ్లలో కన్నాలు వేయటం మొదలుపెట్టాడు. ప్రధాన నిందితుడు షేక్ కాజా 2021 నుంచి దొంగతనాలు చేయడం ప్రారంభించాడు. దొంగల ముఠా నాయకుడైన ఒక్క షేక్ కాజా పైనే దాదాపు 41 దొంగతనం కేసులు నమోదయ్యాయి. మిగిలిన ఇద్దరూ.. మహేష్, జమీర్ ఒక్కొకరిపై పాతిక కేసుల వరకు ఉన్నాయి. దొంగతనం చేసిన ప్రతిసారి జైలుకు వెళ్లడం… తిరిగి రావడం… మళ్లీ దొంగతనాలు చేయటం పరిపాటిగా మారింది. ఇలా పెయింటింగ్ వృత్తిని పక్కనపెట్టి… చోరకళను వృత్తిగా మార్చుకున్నారు. పట్టుబడిన నిందితుల నుంచి 22 లక్షల రూపాయలు విలువైన 310 గ్రాముల బంగారు ఆభరణాలు… దొంగతనానికి ఉపయోగించే బైకు, కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రెండిళ్లు మెయింటైన్ చేయాలంటే… ఎవరింటికైనా కన్నం వేయాలి… అంటుంటారు కదా… సరిగ్గా ఇక్కడ పెయింటర్ షేక్ ఖాజా కూడా రెండిళ్లు మెయింటైన్ చేయలేక ఇళ్లకు కన్నం వేయడం మొదలుపెట్టాడు… చివరకు కటకటాల పాలయ్యాడు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..