Telugu News Andhra Pradesh News Cancellation And Diversion of These Trains For Developmental Work At Vijayawada Division Full List Here
Trains Cancel: రైల్వే ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. పలు రైళ్లు రద్దు.. మరికొన్ని దారి మళ్లింపు.. పూర్తి వివరాలివే..
రైలు ప్రయాణికులకు విజయవాడ రైల్వే డివిజన్ అధికారులు అలర్ట్ జారీ చేశారు. విజయవాడ డివిజన్‌లో నిర్వహణ పనుల దృష్ట్యా పలురైళ్లను రద్దు చేయడంతోపాటు మరికొన్నింటిని దారి మళ్లిస్తున్నట్లు రైల్వే అధికారులు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. రైల్వే ట్రాక్ మరమ్మతులు, పలు పనుల దృష్ట్యా పలు రైళ్లను పూర్తిగా..
రైలు ప్రయాణికులకు విజయవాడ రైల్వే డివిజన్ అధికారులు అలర్ట్ జారీ చేశారు. విజయవాడ డివిజన్‌లో నిర్వహణ పనుల దృష్ట్యా పలురైళ్లను రద్దు చేయడంతోపాటు మరికొన్నింటిని దారి మళ్లిస్తున్నట్లు రైల్వే అధికారులు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. రైల్వే ట్రాక్ మరమ్మతులు, పలు పనుల దృష్ట్యా పలు రైళ్లను పూర్తిగా.. మరికొన్నింటిని పాక్షికంగా రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వేశాఖ వెల్లడించింది. ఇంకా కొన్నింటిని దారి మళ్లించినట్లు పేర్కొంది. రైలు ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలని.. అందుకు తగినట్లుగా ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవాలని రైల్వే అధికారులు సూచించారు.
రద్దయిన రైళ్ల వివరాలు ఇవే..
17239/17240 – గుంటూరు-విశాఖపట్నం (జనవరి 29 నుంచి ఫిబ్రవరి 25 వరకు)
07977/07978 – విజయవాడ-బిట్రగుంట (జనవరి 29 నుంచి ఫిబ్రవరి 25 వరకు)
17219/17220 – మచిలీపట్నం-విశాఖపట్నం (జనవరి 29 నుంచి ఫిబ్రవరి 26 వరకు)
17243/17244 – గుంటూరు-రాయగడ (జనవరి29 నుంచి ఫిబ్రవరి 26 వరకు)
పాక్షికంగా రద్దయిన రైళ్లు.. విజయవాడ – రామవరప్పాడు మధ్య ఈ నెల 29వ తేదీ నుంచి ఫిబ్రవరి 25 వరకు..
07896 మచిలీపట్నం – విజయవాడ
07769 విజయవాడ – మచిలీపట్నం
07863 విజయవాడ – నర్సాపూర్
07866 విజయవాడ – మచిలీపట్నం
07770 మచిలీపట్నం – విజయవాడ
07283 విజయవాడ – భీమవరం జంక్షన్
07870 మచిలీపట్నం – విజయవాడ
07861 విజయవాడ – నర్సాపూర్..
దారి మళ్లింపు రైళ్ల వివరాలు.. వయా విజయవాడ, భీమవరం, నిడదవోలు..
22643 యర్నాకుళం-పాట్నా (జనవరి 29, ఫిబ్రవరి 5, 12, 19 తేదీల్లో)