కాల్ సెంటర్ ఎఫెక్ట్: సీఐ సస్పెన్షన్..!

| Edited By:

Dec 02, 2019 | 8:51 AM

ఏపీలోని కాల్ సెంటర్‌ ఎఫెక్ట్‌కి సీఐ సస్పెన్షన్‌కి గురయ్యాడు. అనంతపురం జిల్లా కదిరి టౌన్ సీఐ మల్లికార్జున గుప్తాపై సస్పెన్షన్ వేటు పడింది. ఆయన అవినీతికి పాల్పడుతున్నట్లు.. ఆరోపణలు రావడంతో.. సీఐని సస్పెండ్ చేశారు డీఐజీ. ఫిర్యాదుదారుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేసినట్టు కాల్స్ రావడంతో.. డీఐజీ కాంతీరాణా విచారణకు ఆదేశించారు. ఈ విచారణలో మల్లికార్జున్.. దాదాపు కోటి రూపాయలు అక్రమంగా సంపాదించినట్టు బయటపడటంతో.. సస్పెన్షన్‌కి గురయ్యాడు. ఈ రకంగా చూస్తుంటే.. సీఎం జగన్.. కాల్ […]

కాల్ సెంటర్ ఎఫెక్ట్: సీఐ సస్పెన్షన్..!
Follow us on

ఏపీలోని కాల్ సెంటర్‌ ఎఫెక్ట్‌కి సీఐ సస్పెన్షన్‌కి గురయ్యాడు. అనంతపురం జిల్లా కదిరి టౌన్ సీఐ మల్లికార్జున గుప్తాపై సస్పెన్షన్ వేటు పడింది. ఆయన అవినీతికి పాల్పడుతున్నట్లు.. ఆరోపణలు రావడంతో.. సీఐని సస్పెండ్ చేశారు డీఐజీ. ఫిర్యాదుదారుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేసినట్టు కాల్స్ రావడంతో.. డీఐజీ కాంతీరాణా విచారణకు ఆదేశించారు. ఈ విచారణలో మల్లికార్జున్.. దాదాపు కోటి రూపాయలు అక్రమంగా సంపాదించినట్టు బయటపడటంతో.. సస్పెన్షన్‌కి గురయ్యాడు.

ఈ రకంగా చూస్తుంటే.. సీఎం జగన్.. కాల్ సెంటర్ కార్యక్రమం బాగానే.. పనిచేస్తున్నట్టు అర్థమవుతోంది. దీంతో.. ప్రజలకు కూడా.. వాటిపై ఏవైనా అపోహలు ఉంటే.. తీరతాయనడంలో సందేహం లేదు.