తెలుగు రాష్ట్రాల ప్రజలకు సంక్రాంతి ఫెస్టివల్ అతిపెద్ద పండుగ.. సొంతులకు పెద్ద సంఖ్యలో ప్రయాణమై తరలి వెళ్తూ ఉంటారు.. హైదరాబాద్ నుంచి ఏపీకి లక్షలలో తరలివస్తూ ఉంటారు.. ఫెస్టివల్ కి వెళ్లేవారు నెల ముందే టికెట్లు రిజర్వేషన్ చేసుకున్నారు.. ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో హైదరాబాద్ నుంచి ఏపీలోని పలు ప్రాంతాలకు ఆర్టీసీ అధికారులు 2,400 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు.. వీటిలో సాధారణ చార్జీలే వసూలు చేయాలని అధికారులు నిర్ణయించారు.. ఈనెల 9 నుంచి 13 వరకు పలు ప్రాంతాలకు ప్రత్యేక బస్సులు తిరగనున్నాయి.. అయితే ప్రత్యేక బస్సుల్లో కొన్నింటికి మాత్రమే ముందస్తు రిజర్వేషన్ సదుపాయాన్ని కల్పించారు.
సాధారణ చార్జీలు వసూలు చేయడం సహా రానుపోను టికెట్ తీసుకున్న వారికి టికెట్ చార్జీల్లో 10% రాయితీని ఏపీఎస్ఆర్టీసీ కల్పిస్తుంది.. దీంతో సీట్లు బుకింగ్ కోసం ప్రయాణికులు పోటీ పడుతున్నారు.. హైదరాబాద్ నుంచి రాజమండ్రి కాకినాడ విశాఖపట్నం శ్రీకాకుళం విజయనగరం తదితర ప్రాంతాలకు వెళ్లే బస్సుల్లో టికెట్లు హార్ట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. ఈనెల 11 12 తేదీల్లో హైదరాబాద్ నుంచి కోస్తాంధ్ర ఉత్తరాంధ్ర వైపు వెళ్లే అన్ని బస్సు సర్వీసులో టికెట్ల బుకింగ్లు పూర్తయ్యాయి.. హైదరాబాద్ నుంచే కాదు విజయవాడ నుంచి పలు ప్రాంతాలకు వెళ్లాల్సిన బస్సుల్లోనూ సీట్లు లభించడం లేదు.. ఫెస్టివల్ తర్వాత తిరుగు ప్రయాణంలోనూ ఇదే పరిస్థితి నెలకొననుంది.. వాళ్లు బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్ కల్పించకపోవడంతో సీట్లు లభిస్తాయో లేవా అన్న ఆందోళనలో ప్రయాణికులు బస్టాండ్లకు వెళ్ళేందుకు వెనుకడుగు వేస్తున్నారు..
ఇదిలా ఉంటే మరోవైపు ఫెస్టివల్ కి రైల్వే శాఖ కూడా అరాకోరగానే ప్రత్యేక రైళ్లను వేయడంతో ప్రయాణికుల అవసరాలను తీర్చలేక పోతున్నాయి.. ఈనెల 9 నుంచి 13 వరకు హైదరాబాద్ నుంచి ఏపీ వైపు వెళ్లే అన్ని రైల్లోనూ ఇప్పటికే వెయిటింగ్ లిస్ట్ రోజురోజుకి పెరిగిపోతుంది.. బస్సులు రైళ్లలో సీట్లపై ఆశలు వదులుకున్న కొందరు ప్రయాణికులు ప్రైవేట్ ట్రావెల్స్ వైపు అడుగులు వేస్తున్నారు.. దీన్ని క్యాష్ చేసుకుంటున్నాం ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యం టికెట్ ధరలను పెంచేసి విక్రయాలు జరుగుతున్నాయి.. కొన్ని రూట్లలో రెండు నుంచి మూడు రెట్లు చార్జీలు వసూలు చేస్తున్నారు.. ఆన్లైన్ వేదిక్కుగా చార్జీలో బాదుడు బహిరంగంగానే జరుగుతున్న ఆర్టీసీ అధికారులు మాత్రం చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారు.. కొందరు ప్రయాణికులు ఆర్టిఏ అధికారులకు ఫోన్ చేసి ఫిర్యాదు చేసిన పట్టించుకోవడంలేదని విమర్శలు చేస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి