Andhra Pradesh: సచివాలయంలో గేదెలు.. అసలు సమస్య ఏంటో తెలిస్తే మీరు కూడా నివ్వెరపోతారు

|

Aug 01, 2022 | 8:46 AM

గుంటూరులో గేదెల గురించిన ఓ పంచాయతీ ఇప్పుడు వార్డు సచివాలయానికి చేరింది. తప్పనిసరి పరిస్థితుల్లో రైతు ఇంటి నుంచి గేదెలను తోలుకువచ్చి.. సచివాలయంలో కట్టేశారు అధికారులు.

Andhra Pradesh: సచివాలయంలో గేదెలు.. అసలు సమస్య ఏంటో తెలిస్తే మీరు కూడా నివ్వెరపోతారు
representative image
Follow us on

Guntur: గుంటూరు కార్పొరేషన్‌ పరిధిలోని ఏటుకూరు ఏరియాలో ఓ వ్యక్తి ఇంట్లోనే గేదెలు కట్టేస్తున్నాడు. దీంతో అవి అక్కడే పేడ వేయడంతో పాటు యూరిన్ కూడా పాస్ చేస్తున్నాయి. ఆ గేదెల యజమాని ఏమైనా శుభ్రత మెయింటైన్ చేస్తున్నాడా అంటే అదీ లేదు. దీంతో చుట్టుపక్కల వారికి ముక్కుపుటాల అదిరేలా దుర్వాసన వస్తుంది. ప్రజంట్ వర్షాకాలం కావడంతో పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. దీంతో ఆ గేదెలు ఉండే ఇంటి పక్కనే కుటుంబంతో నివశించే ఓ వ్యక్తి సమస్యపై స్పందన(spandana call centre)లో కంప్లైంట్ చేశాడు. అంతేకాదు అధికారులకు వినతిపత్రాలు కూడా ఇస్తూ వస్తున్నాడు. సంవత్సర కాలంగా ఈ తంతు నడుస్తూనే ఉంది. కాగా తమకు ఫిర్యాదు అందినప్పుడల్లా.. ఆ గేదెల యజమానికి శానిటరీ అధికారులు నోటీసులు ఇచ్చారు. గేదెలను అక్కడి నుంచి తరలించాలని కోరారు. కానీ అతను పట్టించుకోదు. ప్రజంట్ ఈ వ్యవహారం కోర్టుకు కూడా చేరింది. దీంతో ఆఫీసర్స్ కాస్త సీరియస్ అయ్యారు. ఆ పాడి రైతు ఇంటి నుంచి గేదెలను తోలుకుని వచ్చి.. వార్డు సచివాలయం పక్కన స్థలంలో కట్టేశారు. అక్కడికి వచ్చి పాలు తీసుకోమని  సదరు రైతుకు చెప్పారు. అయితే గేదెలు తోలుకొచ్చిన అధికారులు.. ఓ దూడను మాత్రం ఇంటి వద్దే వదిలేసి వచ్చారు. దీంతో అది అదే పనిగా అరుస్తుంది. తప్పనిసరి పరిస్థితుల్లోనే ఇలా చేయాల్సి వచ్చిందని శానిటరీ సూపర్‌ వైజర్‌ వెంకటేశ్వరరావు తెలిపారు. రైతు శ్రీనివాస్‌ ఆ గేదెలను అక్కడి నుంచి తరలిస్తానని హామి ఇస్తేనే.. ఆ గేదెలను వదిలిపెడతామని చెప్తున్నారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి