Six Legs Buffalo Calf : ప్రప్రంచంలో రోజు ఎక్కడో చోట అనేక వింతలు విడ్డూరాలు చోటు చేసుకుంటూనే ఉంటాయి. అతి పెద్ద జీవి.. అతి చిన్న జీవి.. జీవుల్లోని అవయవాల్లో కూడా అనేక మార్పులు, మరికొన్ని జీవులు రెండు రకాల జంతువులను తలపించేలా జన్మిస్తూనే ఉంటాయి. రెండు తలలు పాములు, మనిషి ఆకారంలో పంది పిల్లల జననం.. ఇలా అనేక వింత జంతువులు పుడుతూనే ఉన్నాయి. ఇక ఇలాంటి వింతతో కూడిన జంతువులు పుడితే. స్థానికంగా ప్రజలు వాటిని చూడడానికి పరుగులు తీస్తూనే ఉంటారు. తాజాగా అటువంటి ఓ వింత జంతువు తూర్పుగోదావరి జిల్లాలో జన్మించింది. వివరాల్లోకి వెళ్తే,,
పిఠాపురం మండలంలోని రామపర్తి గ్రామంలో సురారెడ్డి అనే రైతు నివసిస్తున్నాడు. అతనికి గేదెలున్నాయి. వాటిల్లో ఒక గేదె నిన్న రాత్రి ఈనింది. అతనికి ఆనందం ఎంతో నిలవలేదు. దూడను షాక్ అయ్యాడు.. ఎందుకంటే దూడకు ఆరుకాళ్ళున్నాయి. ఎందుకంటే సాదరంగా గేదెలకు నాలుగు కళ్ళు ఉంటాయి. మరి అప్పుడే పుట్టిన లేగదూడకు ఆరు కాళ్ళు ఉండడం చూసి సురారెడ్డి షాక్ తిన్నాడు. ముందున్న రెండు కాళ్ల మధ్యలో ఓ కాలు, వెనుకున్న రెండుకాళ్ల మధ్యలో మరో కాలు అదనంగా ఉన్నాయి. ఈ విషయం ఆనోటా.. ఈనోటా ఊరంతా తెలిపింది.. దీంతో ఈ వింత దూడను చూడడానికి జనం క్యూలు కట్టారు. కొంతమంది ఇది కలియుగమని.. బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పినట్లు అన్నీ వింతలే జరుగుతున్నాయని వ్యాఖ్యానిస్తున్నారు.
అయితే ఈ విషయం పై పశుసంవర్ధక శాఖ అధికారులు స్పందిస్తూ.. జన్యుపరమైన లోపాలతో ఇటువంటి దూడలు పుడతాయని ఇందులో వింత ఏమీ అంటున్నారు. సర్వసాధారణంగా ఇలా జన్మించినవి త్వరగా మరణిస్తాయని చెప్పారు. అయితే ఆ బుల్లి దూడ జనం. అధికారుల అభిప్రాయంతో సంబంధం లేకుండా ఎక్స్ ట్రా కాళ్ళతో చెంగు చెంగున గంతులేస్తోంది.
Also Read: