Andhra: హైదరాబాద్ టు వైజాగ్‌.. పగలు బీఎండబ్ల్యూలో కనిపిస్తాడు.. రాత్రయితే ముసుగు వేసుకుని..

వృత్తి సాఫ్ట్‌వేర్ ఉద్యోగం.. ప్రవృత్తి దొంగతనాలు..! విలాసాలకు అలవాటు పడ్డాడు.. చోరీలు ప్రారంభించాడు. టిప్ టాప్ గా తిరుగుతాడు ఇళ్లను గుల్ల చేసేస్తాడు.. చోరీ చేసిన సొత్తుతో BMW కారులో దొరుకుతూ ఎంజాయ్ చేస్తున్నాడు. పార్టీలు.. షికార్లు.. ఇలా ఒకటి ఏంటి మరి..! సింగల్ గానే వెళ్తాడు ముసుగు వేసుకొని పని కానిచ్చేస్తాడు.

Andhra: హైదరాబాద్ టు వైజాగ్‌.. పగలు బీఎండబ్ల్యూలో కనిపిస్తాడు.. రాత్రయితే ముసుగు వేసుకుని..
Vizag Crime News

Edited By:

Updated on: Feb 11, 2026 | 11:30 AM

వృత్తి సాఫ్ట్‌వేర్ ఉద్యోగం.. ప్రవృత్తి దొంగతనాలు..! విలాసాలకు అలవాటు పడ్డాడు.. చోరీలు ప్రారంభించాడు. టిప్ టాప్ గా తిరుగుతాడు ఇళ్లను గుల్ల చేసేస్తాడు.. చోరీ చేసిన సొత్తుతో BMW కారులో దొరుకుతూ ఎంజాయ్ చేస్తున్నాడు. పార్టీలు.. షికార్లు.. ఇలా ఒకటి ఏంటి మరి..! సింగల్ గానే వెళ్తాడు ముసుగు వేసుకొని పని కానిచ్చేస్తాడు. అందుకే పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో ముసుగు దొంగగా పేరుపడ్డాడు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా.. విశాఖలోని 26 నేరాలు చేసేసాడు.

అచ్చి మహేష్ రెడ్డి అలియాస్ సన్నీ.. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రాంతానికి చెందినవాడు. విశాఖలోని మాధవధార లో సెటిల్ అయ్యాడు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి హైదరాబాదులో ప్రముఖ ఐటీ కంపెనీలో ఉద్యోగం సంపాదించాడు. మంచి జీతం వస్తోంది.. కానీ విలాసాలకు అలవాటు పడి అది ఏమాత్రం సరిపోలేదు. అప్పటికే అలవాటుగా పడిన దొంగతనాలకు మరింత పని చెప్పాడు. ఇలా విశాఖలోని అవకాశం దొరికినప్పుడల్లా చేతివాటం చూపించాడు. ఇలా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 26 చోరీలు విశాఖలోనే చేసేసాడు.

ఆ కేసులో కూపీ లాగితే..

గాజువాక జోగివాని పాలెంలో గతేడాది అక్టోబర్‌లో శివరామకృష్ణ అనే వ్యక్తి ఇంట్లోకి చొరబడ్డాడు. ఆ సమయంలో శివరామకృష్ణ తన కుమార్తె డాన్స్ ప్రోగ్రాం కోసం అరుణాచలం వెళ్లారు. ఇదే అదనగా భావించిన మహేష్ రెడ్డి.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో చొరబడ్డాడు. ఇంట్లో ఉన్న 17 తులాల బంగారం 30 తులాల వెండి వస్తువులు అపహరించిపోయాడు. కేసు నమోదు చేసిన గాజువాక క్రైమ్ పోలీసులు వెరిఫై చేస్తే.. సిసి ఫుటేజ్ లో కదలికలు కనిపించాయి. కానీ ముఖానికి మాస్క్ చేతికి గ్లౌస్ కూడా ఉన్నాయి. ఎక్కడ ఆచూకీ గుర్తుపట్టేలా కనిపించలేదు. దీంతో.. దాదాపు నాలుగు నెలలపాటు శ్రమించారు పోలీసులు. ఎట్టకేలకు మహేష్ రెడ్డి అలియాస్ సన్నీని అరెస్ట్ చేశారు. పట్టుకొని విచారిస్తే.. వాడి నేరాల చిట్టా చూసి పోలీసులే కంగుతిన్నారు. ఒక కేసులో కూపి లాగితే.. 26 కేసుల గుట్టు బయటపడింది. గాజువాకతో పాటు ఆరిలోవ మల్కాపురం పెందుర్తి దువ్వాడ పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా గల కొద్ది రోజులుగా జరిగిన నేరాల్లో ఇతనే నిందితుడని తెల్చారు పోలీసులు. చోరీ చేసిన సొమ్ముతో తెగ జలసాలు చేశాడు మహేష్ రెడ్డి. BMW కారు కొనుగోలు చేసి అందులో తిరిగేవాడు. తాజాగా చోరీ చేసి.. స్నేహితులకు పార్టీ కూడా ఇచ్చాడని టీవీ9 తో అన్నారు సీపీ బాగ్చి.

వాడి వ్యవహారం అలా ఉంటుంది..

26 కేసుల్లో 1084.94 బంగారం పోయింది. అందులో 699 గ్రాముల బంగారం, 3.805 గ్రాముల వెండి సీజ్ చేశారు. అంతేకాదు.. చోరీ చేసిన డబ్బులతో కొనుగోలు చేసిన BMW కారు, చోరీలు చేసేందుకు వినియోగించిన మరో స్కూటీని కూడా సీజ్ చేశారు పోలీసులు. నెరాలకు వినియోగించే ఉపకరణాలు ఐరన్ రాడ్, సుత్తి, హెల్మెట్, స్క్రూ డ్రైవర్, కటింగ్ ప్లేయర్, డ్రిల్లింగ్ మిషన్, మాస్క్, గ్లౌస్ లను స్వాధీనం చేసుకున్నారు.

అప్పటినుంచే ఆ చోరీలు..

15 ఏళ్ల వయసులోనే నాలుగు చోరీలు చోరీలు చేసినట్టు గుర్తించారు పోలీసులు. హోమ్ నుంచి విడుదలయ్యాక మరిన్ని చోరీలు చేసాడు. కాకినాడ, సర్పవరం, రామచంద్రాపురం, ఇంద్రాల పాలెం, రాజమండ్రి పోలీస్ స్టేషన్లలో సుమారు 32 దొంగతనాల కేసులు నమోదైనట్టు పోలీసులు చెబుతున్నారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో 14 నెలల శిక్ష అనుభవించాడు మహేశ్వర్ రెడ్డి. అన్ని కలిపి దాదాపుగా 60 కి పైగా ఇంటి దొంగతనం కేసులు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. హైదరాబాదులో ఉంటూ అప్పుడప్పుడు విశాఖ వచ్చి దొంగతనాలు చేస్తూ.. మళ్ళీ హైదరాబాద్ వెళ్లి విలాసవంతమైన జీవితం కొనసాగిస్తున్నట్టు గుర్తించామన్నారు క్రైం డీసీపీ లతా మాధురి.

ముసుగు వేసుకొని సింగిల్ గా వెళ్లి చోరీలు చేసే ఈ మహేష్ రెడ్డిని పోలీస్ డిపార్ట్మెంట్లో ముసుగు దొంగగా పేరుపడ్డాడు. వాడి కోసం నాన్న పాటలు పడి ఎట్టకేలకు పట్టుకున్నారు పోలీసులు. దీంతో అంతా ఊపిరిపించుకున్నారు. మరిన్ని నేరాలు జరగకుండా కట్టడి చేయగలిగారు. అయితే ఇప్పుడు అరెస్టు చేసిన పోలీసులు కఠినంగా వ్యవహరించేందుకు సిద్ధమయ్యారు. ఇదండీ ఈ సాఫ్ట్వేర్ ముసుగు దొంగ నేరాల చిట్టా.. చోరీల స్టైల్..!

వీడియో చూడండి..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..