Pawan Kalyan: తనకు బ్లేడ్‌ బ్యాచ్‌ ముప్పు ఉందన్న పవన్.. ప్రజల్లో తిరగలేకే అంటున్న ముద్రగడ

|

Apr 04, 2024 | 7:56 PM

బ్లేడ్‌ బ్యాచ్‌ తనను టార్గెట్‌ చేసిందన్న పవన్‌ కామెంట్స్.. ఏపీ పాలిటిక్స్‌లో కాకరేపుతున్నాయి. తనపై హత్యాయత్నం జరుగుతోందన్న పవన్‌ వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబడుతోంది అధికార పక్షం. ప్రజల్లో తిరగడం ఇష్టం లేకే..పవన్‌ ఇలాంటి అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని ఆరోపిస్తోంది. పవన్‌పై నిజంగా దాడి జరిగితే ఎందుకు ఫిర్యాదు చేయలేదన్న ప్రశ్నలు మరోవైపు వినిపిస్తున్నాయి.

Pawan Kalyan: తనకు బ్లేడ్‌ బ్యాచ్‌ ముప్పు ఉందన్న పవన్.. ప్రజల్లో తిరగలేకే అంటున్న ముద్రగడ
Pawan Kalyan
Follow us on

బ్లేడ్‌ బ్యాచ్‌ తనను టార్గెట్‌ చేసిందంటూ ఒక్క కామెంట్‌తో ఏపీ రాజకీయాల్లో హీట్‌ పుట్టించారు..పవన్‌ కల్యాణ్‌. తనపై హత్యాప్రయత్నం జరుగుతోందంటూ పవన్‌ చేసిన వ్యాఖ్యలు.. కలకలం రేపుతున్నాయి. తన చుట్టూ అభిమానులు, పార్టీ కార్యకర్తలు ఎక్కువ మంది చేరినప్పుడు.. కొందరు కిరాయి మూకలు కూడా వచ్చి, సన్నటి బ్లేడ్లతో సెక్యూరిటీ వాళ్లను కట్ చేస్తున్నారని చెప్పారు. వాళ్లనే కాదు తనపైనా ఇలాంటి దాడే జరిగిందని డైరెక్టుగా చెప్పారు. ఈ దాడి ప్రత్యర్ధి పనే అంటూ ఆరోపించారు పవన్‌.

పవన్‌ వ్యాఖ్యలకు కౌంటర్‌ ఇచ్చారు..వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం. బౌన్సర్లు లేకపోతే బయటికిరాలేని పవన్‌కు రాజకీయాలెందుకు? అని ప్రశ్నింస్తున్నారాయన. పిరికితనం, చేతకానితనంతో పవన్‌ మాట్లాడుతున్నారని.. కార్యకర్తలను దగ్గరకు రాకుండా చేసేందుకే పవన్‌ బ్లేడ్‌బ్యాచ్‌లు అంటున్నారని ఆరోపించారు. పవన్‌కు అంత భయమైతే రాజకీయాలు మానేయాలంటున్నారు ముద్రగడ.

రాజకీయంగా తాను పదేళ్లలో ఏం చేశాను..? రానున్న రోజుల్లో ఏం చేస్తాను అని చెప్పుకోలేని పరిస్థితుల్లోనే..పవన్‌ కల్యాణ్‌ ఇలాంటి కామెంట్స్‌ చేస్తున్నారని ఆరోపిస్తోంది వైసీపీ. ఎలాగానై నాకు ఓటు వేయండి అని చెప్పుకునేందుకే పవన్‌ తంటాలు పడుతున్నారని విమర్శించారు సజ్జల. పవన్‌ కల్యాణ్‌ నుంచి ఇలాంటి మాటలు రావడం ఇదేం కొత్త కాదు. ఏడాదిన్నర క్రితం కూడా ఇలాంటి సెన్సేషనల్ కామెంట్సే చేశారు. ఏకంగా తనను చంపేందుకే ప్రయత్నిస్తున్నారన్నారు. అప్పట్లో ఈ కామెంట్స్‌ అతిపెద్ద సంచలనం. ప్రత్యర్థులు సుపారీ ఇచ్చి మరీ గ్యాంగ్స్‌ను రంగంలోకి దింపారని ఆనాడు సంచలన వ్యాఖ్యలు చేశారు పవన్ కల్యాణ్. తనకు ప్రాణహాని ఉందన్న విషయాన్ని ఆనాడే మొదటిసారి చెప్పారు.

ఇంతకీ పవన్ కల్యాణ్‌పై దాడి చేసిన ఆ ప్రత్యర్ధులు ఎవరు? ఇదే ప్రశ్న వినిపిస్తోందిప్పుడు. బ్లేడ్‌తో దాడి చేస్తే.. సెక్యూరిటీ సిబ్బంది ఎందుకు చూస్తూ ఊరుకున్నారు..వారిని ఎందుకు పట్టుకోలేదనే డౌట్‌ వ్యక్తమవుతోంది. ఒకవేళ దాడి నిజమైతే.. పోలీసులకు కంప్లైంట్‌ చేశారా లేదా అని ప్రశ్నిస్తున్నారు. మరి జనసేన అధినేత ఈ క్వచ్చన్స్‌కు ఎలాంటి కౌంటర్‌ ఇస్తారో చూడాలి. ఏదేమైనా బ్లేడ్‌ కామెంట్స్‌ ఏపీ రాజకీయాల్లో హీట్‌ పుట్టిస్తున్నాయి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..