YCP vs BJP: ఏపీలో సాంగ్ వార్.. పాట మాదంటే మాదంటున్న వైసీపీ, బీజేపీ.. రంజుగా రాజకీయం

|

Mar 30, 2021 | 11:48 AM

ఒక పాట...రెండు పార్టీల మధ్య వివాదం. ఇప్పుడు ఏపీలో ఇదే కాంట్రవర్శీ నడుస్తోంది. మాంచి...జోష్‌ ఇచ్చే..ఈ సాంగ్‌ మాదంటే...మాది అంటున్నారు.

YCP vs BJP: ఏపీలో సాంగ్ వార్.. పాట మాదంటే మాదంటున్న వైసీపీ, బీజేపీ.. రంజుగా రాజకీయం
Ysrcp Vs Bjp
Follow us on

ఒక పాట…రెండు పార్టీల మధ్య వివాదం. ఇప్పుడు ఏపీలో ఇదే కాంట్రవర్శీ నడుస్తోంది. మాంచి…జోష్‌ ఇచ్చే..ఈ సాంగ్‌ మాదంటే…మాది అంటున్నారు. ఇంతకీ ఆ పాట ఎవరిది..? ఆ సాంగ్‌లో అంత దమ్ముందా..? అది తెలియాలంటే ముందుగా తిరుపతి బైపోల్‌లో వైసీపీ విడుదల చేసిన సాంగ్ చూద్దాం..

ఇక వివాదానికి కారణమైన బీజేపీ సాంగ్‌ ఓ సారి విందాం..

 

విన్నారుగా…ఈ సాంగ్‌. తిరుపతి బైపోల్‌ ఎలక్షన్‌లో ఎక్కడా చూసిన ఇదే సాంగ్‌ వినిపిస్తోంది. ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రచారంలో హోరెత్తిస్తున్నారు. కార్యకర్తలకు మరింత జోష్‌ ఇచ్చేలా పాటను వాడుతున్నారు. ఇప్పుడు ఈ పాటే బీజేపీ, వైసీపీ మధ్య వివాదం రాజుకునేలా చేస్తోంది.

తమ పాటని బీజేపీ కాపీ కొట్టిందని వైసీపీ శ్రేణులు ఆరోపిస్తున్నారు.’రాయలసీమ ముద్దుబిడ్డ జగనన్న’ అన్న పాటను.. ‘భరతమాత ముద్దుబిడ్డ నరేంద్రమోదీ’ అంటూ బీజేపీ మార్చిందని వైసీపీ శ్రేణులు స్పష్టం చేశాయి. నిన్న నెల్లూరులో నామినేషన్లలో వైసీపీ, బీజేపీ పార్టీలు ఇదే పాటను వినియోగించాయి. పాట ఒక్కటే కానీ..రెండు పార్టీలు పోటీపడి మరీ ఆ సాంగ్‌ను వాడేస్తున్నాయి.

తెలంగాణలో ఈ సాంగ్ జానపద పాటగా ఎంతో పాపులర్‌ అయ్యింది.నిజామాబాద్ ‌జిల్లాకు చెందిన సింగర్‌ గంగా పాడిన ఈ పాట గుర్తింపు తెచ్చింది. మాంచి జోష్‌ మీదుండటంతో ఆయా పార్టీలు…తమకు అనుకూలంగా మార్చుకున్నాయి. ఎన్నికల ప్రచారంలో జోష్‌ కోసం ఈ పాటను వినియోగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ‘రాయలసీమ ముద్దుబిడ్డ జగనన్న’ అంటూ వైసీపీ మొదట ఈ పాటను తమ ఎన్నికల ప్రచారంలో వాడింది. ఆ తర్వాత…ఇదే సాంగ్‌ను భరతమాత ముద్దుబిడ్డ నరేంద్రమోదీ అంటూ బీజేపీ మార్చిందని వైసిపి శ్రేణులు ఆరోపిస్తున్నాయి.

Also Read: ఏపీ విద్యార్థులకు అలెర్ట్.. నేటితో స్కాలర్‌షిప్ దరఖాస్తుకు ముగియనున్న గడువు

విచిత్ర దొంగతనం.. ప్రభుత్వ వాహనం పార్ట్స్ మొత్తం లేపేశారు.. ఫార్మాలిటీకి బాడీ మాత్రం ఉంచారు