పురంధేశ్వరి ప్రత్యేక చొరవ.. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగినట్టేనా.?

వైజాగ్ స్టీల్ ప్లాంట్‎ను ప్రైవేటీకరణ చేయకుండా ఆపాలని ఆంధ్రపదేశ్ బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి ప్రయత్నిస్తున్నారు. అందుకే ప్రత్యామ్నాయాలను ఆలోచించాలని రాజమండ్రి ఎంపీ పురంధరేశ్వరి కేంద్రాన్ని కోరుతున్నారు. లాభాల బాటలో నడిపేందుకు సహకరించాలని కేంద్ర ఉక్కు మంత్రి కుమారస్వామిని తాజాగా దగ్గుబాటి పురందేశ్వరి విజ్ఞప్తి చేశారు. అందుకు స్టీల్ అధారిటీ ఆఫ్ ఇండియాలో విలీనం చేయడమే అత్యుత్తమ ప్రత్యామ్నాయం అని చెబుతున్నారు. మరి పెట్టుబడుల ఉపసంహరణ నిర్ణయాన్ని కేంద్రం వెనక్కి తీసుకుని, పురంధరేశ్వరి ప్రతిపాదనను అంగీకరిస్తుందా? లేదా అన్నది కాలమే నిర్ణయించాల్సి ఉంది.

పురంధేశ్వరి ప్రత్యేక చొరవ.. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగినట్టేనా.?
Union Minister Kumaraswamy
Follow us

| Edited By: Srikar T

Updated on: Jun 27, 2024 | 5:32 PM

వైజాగ్ స్టీల్ ప్లాంట్‎ను ప్రైవేటీకరణ చేయకుండా ఆపాలని ఆంధ్రపదేశ్ బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి ప్రయత్నిస్తున్నారు. అందుకే ప్రత్యామ్నాయాలను ఆలోచించాలని రాజమండ్రి ఎంపీ పురంధరేశ్వరి కేంద్రాన్ని కోరుతున్నారు. లాభాల బాటలో నడిపేందుకు సహకరించాలని కేంద్ర ఉక్కు మంత్రి కుమారస్వామిని తాజాగా దగ్గుబాటి పురందేశ్వరి విజ్ఞప్తి చేశారు. అందుకు స్టీల్ అధారిటీ ఆఫ్ ఇండియాలో విలీనం చేయడమే అత్యుత్తమ ప్రత్యామ్నాయం అని చెబుతున్నారు. మరి పెట్టుబడుల ఉపసంహరణ నిర్ణయాన్ని కేంద్రం వెనక్కి తీసుకుని, పురంధరేశ్వరి ప్రతిపాదనను అంగీకరిస్తుందా? లేదా అన్నది కాలమే నిర్ణయించాల్సి ఉంది.

వైజాగ్ స్టీల్ ప్లాంట్ అంశాన్ని బీజేపీలోని కేంద్ర వర్గం ఒకలా ఆలోచిస్తుంటే రాష్ట్ర వర్గం మాత్రం ఇంకోలా ఆలోచిస్తున్నట్టు కనిపిస్తోంది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని మొదటి నుంచి వ్యతిరేకిస్తున్న కార్మికులు దాదాపు మూడు సంవత్సరాలకుపైగా ఆందోళన చేస్తూనే ఉన్నారు. అలాగే అన్ని రాజకీయ పార్టీలు కూడా ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూనే ఉన్నాయి. కానీ కేంద్రం ఎక్కడ వెనక్కి తగ్గలేదు. ఎందుకంటే పెట్టుబడుల ఉపసంహరణకు సంబంధించిన నిర్ణయం కేవలం విశాఖ స్టీల్ ప్లాంట్‎కు మాత్రమే కాకుండా మిగతా అనేక కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు సంబంధించింది. కాబట్టి ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే ప్రసక్తే ఉండదన్నది ప్రభుత్వ వర్గాల వాదన. వైజాగ్ స్టీల్స్ నుంచి పెట్టుబడుల ఉపసంహరణకు సంబంధించి కన్సల్టెన్సీ, లీగల్ అడ్వైజర్, ట్రాన్సాక్షన్ అడ్వైజర్ అన్నీ నియమించే ప్రయత్నం చేసారు.

ప్రధాని అంగీకరించేనా?

కానీ ఇక్కడ కార్మిక సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుండడం, రాజకీయ పార్టీల సహకారం కూడా లేకపోవడంతో అవి ముందుకు వెళ్లలేదు. కానీ పెట్టుబడుల ఉపసంహరణ నిర్ణయం నుంచి వెనక్కి మాత్రం కేంద్రం తగ్గలేదు. అలా వెనక్కి వెళ్లే ఆలోచన ఉన్నట్టు ఎక్కడా కనపడటం లేదు. అదే సమయంలో రాష్ట్రానికి సంబంధించిన బీజేపీ ముఖ్య నేతలు ఎన్నికలకు ముందు.. అంతకు ముందు కూడా ప్రధానితో అనేక సందర్భాల్లో ఈ విషయాన్ని ప్రస్తావనకు తీసుకువచ్చినట్లు తెలుస్తోంది. దీనిపై ప్రధాని మోదీ అది పాలసీ మేటర్ కాబట్టి అందులో ఎలాంటి మినహాయింపులు చేయలేమని.. ప్రభుత్వం వ్యాపారం చేసే ధోరణి నుంచి బయటికి రావాలన్న నిర్ణయం తీసుకుంది కాబట్టి పెట్టుబడులు ఉపసంహరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోలేమని స్పష్టం చేశారు. అయితే బిజెపి నేతలు మాత్రం ఎప్పటికప్పుడు కేంద్రాన్ని ఒప్పించే ప్రయత్నం చేస్తామని.. వీలైనంతవరకు ప్రైవేటీకరణ జరగకుండా అడ్డుకుంటామని చెప్తూ వచ్చారు. ఎన్నికలకు ముందు జివిఎల్ నరసింహారావు నుంచి సీఎం రమేష్, పురందేశ్వరి వరకు అందరూ చెప్పిన మాటే ఇది.

మధ్యే మార్గంగా స్టీల్ ప్లాంట్‎ని స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్‎లో అయినా విలీనం చేయాలని.. తద్వారా స్టీల్ ప్లాంట్‎కి క్యాప్టివ్ మైండ్స్ లభించి లాభాల బాటలో పయనిస్తుందని చెబుతున్నారు. తద్వారా అక్కడ ఉన్న ఉద్యోగులకి రక్షణ ఉంటుందన్న భావాన్ని వ్యక్తం చేస్తూ వచ్చారు. తాజాగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, బీజేపీ ఎంపీ.. కేంద్ర ముఖ్యమంత్రి కుమారస్వామి కలిసి ఈ అంశంపై చర్చించారు. ఈ అంశంపై సహకరించాలని ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి.. కేంద్రమంత్రి కుమారస్వామిని విజ్ఞప్తి చేశారు.

పురంధరేశ్వరి యాక్షన్ ప్లాన్..

ఒక యాక్షన్ ప్లాన్‎ను రూపొందించి కేబినెట్ మంత్రి కుమార స్వామితో సమావేశమైన పురంధేశ్వరి వినతిపత్రం సమర్పించారు. గతంలో ఇచ్చిన వినతుల ఆధారంగా కుమార స్వామి అధికార యంత్రాంగంతో చర్చలు జరిపిన విషయాన్ని వారి ప్రతినిధులతో వివరించారు. “విశాఖ ఉక్కు – ఆంధ్రుల హక్కు” అనే ఉద్యమంలో నుండి వచ్చిన ఒక భారీ పరిశ్రమ అని కుమార స్వామికి పురంధరేశ్వరి వివరించారట. ఆంధ్రుల సెంటిమెంట్‎ను గౌరవిస్తూ నిర్ణయం ఉండాలన్న విషయాన్ని ప్రస్తావిస్తూ స్టీల్ ప్లాంట్‎ను సమర్థవంతంగా నిర్వహిస్తూ లాభాల బాటలోకి తీసుకుని వచ్చే కోణంలో మాత్రమే విధానాలు ఉండాలన్న విషయాన్ని ఆయన వద్ద ప్రస్తావించినట్లు తెలుస్తోంది.

సానుకూలంగా స్పందించిన ఉక్కుమంత్రి..

స్టీల్ ప్లాంట్‎కు పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు అవసరమైన అన్ని విషయాలను పరిగణలోకి తీసుకోవాలని ఈ సందర్భంగా ఎంపీ పురందేశ్వరి కేంద్ర మంత్రిని కోరారు. ఎంపీ పురందేశ్వరి జరిపిన చర్చలతో కేంద్రమంత్రి కుమారస్వామి సానుకూలంగా స్పందించినట్టు బీజేపీ నేతలు చెబుతున్నారు. అధికారులతో కూలంకషంగా చర్చలు జరిపిన తరువాత ఇదే విషయంపై రెండు నెలల్లో మరో మారు సమావేశం నిర్వహించుకుందామని ఎంపీ పురందేశ్వరికి హామీ ఇచ్చినట్టు సమాచారం.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

Latest Articles