Mrunal Thakur: ఆ ముగ్గురి కోసమే కల్కి సినిమా చేశాను.. హీరోయిన్ మృణాల్ ఠాకూర్ కామెంట్స్..

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, దీపికా పదుకొణే, అమితాబ్, కమల్ హాసన్ నటనకు సినీ ప్రియులు ముగ్దులయ్యారు. అలాగే ఈ మూవీలో సినీ స్టార్స్ ఊహించని అతిథి పాత్రలో నటించడం.. ముఖ్యంగా అశ్వత్థామ పాత్రలో అమితాబ్ యాక్టింగ్ వేరెలెవల్ అని చెప్పాలి. ఇక ఎప్పటిలాగే భైరవ పాత్రలో ప్రభాస్ నటన గురించి చెప్పక్కర్లేదు. ఈ సినిమాకు సౌత్ తోపాటు నార్త్ లోనూ బీభత్సమైన రెస్పాన్స్ వస్తుంది.

Mrunal Thakur: ఆ ముగ్గురి కోసమే కల్కి సినిమా చేశాను.. హీరోయిన్ మృణాల్ ఠాకూర్ కామెంట్స్..
Mrunal Thaku
Follow us

|

Updated on: Jun 30, 2024 | 6:36 AM

ఇప్పుడు ఎక్కడ చూసిన కల్కి 2898 ఏడి పేరు వినిపిస్తుంది. జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. తొలి రోజే వరల్డ్ వైడ్ రూ.191 కోట్లకు పైగా వసూలు చేసింది. డైరెక్టర్ నాగ్ అశ్విన్ రూపొందించిన ఈ అద్భుతమైన విజువల్ వండర్ చూసి ఫిదా అవుతున్నారు అడియన్స్. ఈ మూవీతో హాలీవుడ్ సినిమాను మించిపోయిందని ఖుషీ అవుతున్నారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, దీపికా పదుకొణే, అమితాబ్, కమల్ హాసన్ నటనకు సినీ ప్రియులు ముగ్దులయ్యారు. అలాగే ఈ మూవీలో సినీ స్టార్స్ ఊహించని అతిథి పాత్రలో నటించడం.. ముఖ్యంగా అశ్వత్థామ పాత్రలో అమితాబ్ యాక్టింగ్ వేరెలెవల్ అని చెప్పాలి. ఇక ఎప్పటిలాగే భైరవ పాత్రలో ప్రభాస్ నటన గురించి చెప్పక్కర్లేదు. ఈ సినిమాకు సౌత్ తోపాటు నార్త్ లోనూ బీభత్సమైన రెస్పాన్స్ వస్తుంది.

ఈ మూవీలో విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, రాజమౌళి, అనుదీప్, ఫరియా అబ్దుల్లా, రామ్ గోపాల్ వర్మ, మృణాల్ ఠాకూర్ ఇలా పలువురు స్టార్స్ ఇందులో అతిథి పాత్రలలో మెరిశారు. అయితే తాజాగా తన పాత్ర గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది మృణాల్. కల్కి సినిమాలో అంత చిన్న పాత్ర ఎందుకు చేశారంటూ మృణాల్ కు ఆమె ఫ్యాన్స్ అడుగుతుండగా.. అసలు విషయం చెప్పేసింది. “కల్కిలో కేమియో చేయాలని మూవీ టీమ్ నన్ను సంప్రదించినప్పుడు నేను ఒక్క ముక్క కూడా అడగలేదు. నిర్మాతలు అశ్వినిద్, ప్రియాంక దత్, స్వప్న దత్ ముగ్గురిపై నాకు పూర్తి నమ్మకం ఉంది. సినిమా కథ గురించి కానీ నా పాత్ర గురించి కానీ ఏం అడక్కుండానే యస్ చెప్పాను. కల్కి సినిమా సూపర్ హిట్ అవుతుందని తెలుసు. ఇలాంటి గొప్ప ప్రాజెక్టులో భాగం అయినందుకు సంతోషంగా ఉంది” అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం మృణాల్ చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరలవుతున్నాయి.

కల్కి సినిమాలో దివ్య అనే పాత్రలో నటించింది మృణాల్. మూవీ తొలి పది నిమిషాల్లోనే ఈ పాత్ర కనిపిస్తుంది. ఈ చిత్రాన్ని వైజయంతి మూవీస్ బ్యానర్ పై నిర్మించిన సంగతి తెలిసిందే. గతంలో డైరెక్టర్ హను రాఘవుపూడి తెరకెక్కించిన సీతారామం సినిమాను కూడా ఇదే బ్యానర్ నిర్మించింది. ఇక ఈ మూవీతోనే తెలుగు తెరకు పరిచయమైన మృణాల్ మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

భగవద్గీత శ్లోకాన్నిషేర్ చేసిన షోయబ్ అక్తర్..పాక్ ఫ్యాన్స్ గగ్లోలు
భగవద్గీత శ్లోకాన్నిషేర్ చేసిన షోయబ్ అక్తర్..పాక్ ఫ్యాన్స్ గగ్లోలు
సచిన్ వీరాభిమానికి అదిరిపోయే సర్ ప్రైజ్ ఇచ్చిన రోహిత్ శర్మ
సచిన్ వీరాభిమానికి అదిరిపోయే సర్ ప్రైజ్ ఇచ్చిన రోహిత్ శర్మ
వివో నుంచి అదిరిపోయే ట్యాబ్‌.. ఫీచర్స్‌ మాములుగా లేవు..
వివో నుంచి అదిరిపోయే ట్యాబ్‌.. ఫీచర్స్‌ మాములుగా లేవు..
ఆహాలో పార్వతీశం మార్కెట్ మహాలక్ష్మి.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆహాలో పార్వతీశం మార్కెట్ మహాలక్ష్మి.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
మల్టీస్టారర్‌లకు బూస్టప్ ఇచ్చిన నాగ్ అశ్విన్..
మల్టీస్టారర్‌లకు బూస్టప్ ఇచ్చిన నాగ్ అశ్విన్..
వండర్స్‌ క్రియేట్ చేయడంలో జక్కన్న అప్‌డేట్ అవ్వాలి
వండర్స్‌ క్రియేట్ చేయడంలో జక్కన్న అప్‌డేట్ అవ్వాలి
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై ప్రభుత్వం కీలక నిర్ణయం..
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై ప్రభుత్వం కీలక నిర్ణయం..
పాలనపై సీఎం రేవంత్‌రెడ్డి ఫోకస్‌.. కేబినెట్‌లో వారికే ఛాన్స్‌?
పాలనపై సీఎం రేవంత్‌రెడ్డి ఫోకస్‌.. కేబినెట్‌లో వారికే ఛాన్స్‌?
గర్భిణీలు చిన్న విషయానికే ఎందుకు చిరాకు పడతారో తెలుసా?
గర్భిణీలు చిన్న విషయానికే ఎందుకు చిరాకు పడతారో తెలుసా?
పురుషులకే ఇవే బ్రహ్మాస్త్రాలు.. వీటిని తిన్నారంటే..
పురుషులకే ఇవే బ్రహ్మాస్త్రాలు.. వీటిని తిన్నారంటే..