చెర్రీ సినిమాకి ఇంకా చాలా టైముంది.. కానీ త్వరలోనే గేమ్ మొదలవుతుంది.
Anil Kumar
01 July 2024
మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ - కియారా అద్వానీ జంటగా నటిస్తున్న సినిమా గేమ్ చేంజర్ గురించి తెలిసిందే.!
ఈ సినిమా రిలీజ్ డేట్, అప్డేట్ కోసం చెర్రీ ఫ్యాన్స్ డైరెక్టర్ శంకర్ పై పలు మార్లు అసహనం వ్యక్తం చేశారు.
ఇక ఆఫ్టర్ లాంగ్ గ్యాప్.. గేమ్ చేంజర్ సినిమాకు సంబంధించి ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు దర్శకుడు శంకర్.
షూటింగ్ చివరి దశలో ఉందని.. ఇంకో పది రోజులు షూటింగ్ మాత్రమే బ్యాలెన్స్ ఉందని తెలిపారు డైరెక్టర్ శంకర్.
కమల్ తో భారతీయుడు 2 రిలీజ్ తరువాత.. మెలిగిన గేమ్ చేంజర్ షెడ్యూల్ ప్లాన్ చేస్తామని క్లారిటీ ఇచ్చారు.
సినిమా షూటింగ్ పూర్తయి., రషెస్ చుసిన తరువాతే రిలీజ్ డేట్ విషయంలో ఫైనల్ నిర్ణయం తీసుకుంటామన్నారు శంకర్.
ఆ తర్వాత ఫుటేజ్ లాక్ చేసి, పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రారంభిస్తామని.. ఈ సినిమా తప్పకుండ నచ్చుతుందని అన్నారు.
ఇప్పుడు ఉన్న బిజీ షెడ్యూల్ దాటుకొని త్వరలోనే విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టు తెలిపారు డైరెక్టర్.
ఇక్కడ క్లిక్ చెయ్యండి