Watch Video: నల్లమల అడవుల్లో చిరుత హల్చల్.. బోనులో బంధించిన ఫారెస్ట్ అధికారులు..

ఓ మహిళను చంపి తిని.. మరో ఐదు మందిని గాయపరిచి భయభ్రాంతులకు గురిచేసిన చిరుత పులి ఎట్టకేలకు బోనులో చిక్కుకుంది. దీంతో ఎన్నో రోజులుగా నిద్ర లేని రాత్రులు గడిపిన స్థానికులకు కాస్త ఉపశమనం లభించింది. నెల రోజుల పాటు పచ్చర్ల గ్రామస్తులను, ఫారెస్ట్ అధికారులకు కంటి మీద‌కునుకు లేకుండా చేసిన చిరుతను బోనులో బంధించారు ఫారెస్ట్ అధికారులు.

Watch Video: నల్లమల అడవుల్లో చిరుత హల్చల్.. బోనులో బంధించిన ఫారెస్ట్ అధికారులు..
Nandyala District
Follow us

| Edited By: Srikar T

Updated on: Jun 29, 2024 | 6:48 PM

ఓ మహిళను చంపి తిని.. మరో ఐదు మందిని గాయపరిచి భయభ్రాంతులకు గురిచేసిన చిరుత పులి ఎట్టకేలకు బోనులో చిక్కుకుంది. దీంతో ఎన్నో రోజులుగా నిద్ర లేని రాత్రులు గడిపిన స్థానికులకు కాస్త ఉపశమనం లభించింది. నెల రోజుల పాటు పచ్చర్ల గ్రామస్తులను, ఫారెస్ట్ అధికారులకు కంటి మీద‌కునుకు లేకుండా చేసిన చిరుతను బోనులో బంధించారు ఫారెస్ట్ అధికారులు. దీంతో గ్రామస్థులు ఊపిరిపీల్చుకున్నారు. బోనులో చిక్కిన చిరుతను తిరుపతిలోని ఎస్వీ జూకు తరలించారు. ఈ ఘటన నంద్యాల జిల్లా శిరివెళ్ళ మండల పచ్చర్ల గ్రామంలో చోటు చేసుకుంది. నంద్యాల జిల్లా మహానంది నల్లమల అడవిలో ఈ నెల 25న పచ్చర్ల అడవిలో కట్టెల కోసం వెళ్ళిన మోహరున్నిసా అనే మహిళపై చిరుతపులి దాడి చేసింది. దీంతో ఆమె ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన స్థానికులను తీవ్ర భయభ్రాంతులకు గురిచేయడంతో పాటు స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

ఉదయం కట్టెల కోసం అడవికి వెళ్ళి సాయంత్రం అయినా రాకపోవడంతో కుటుంబ సభ్యులు కంగారుతో గాలించారు. అడవిలోని ఒక వంక వద్ద విగత జీవిగా పడి ఉన్న మహిళను కుటుంబ సభ్యులు గమనించి ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. మృతి చెందిన మహిళ గతంలో ఉప సర్పంచ్‎గా పని చేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అప్పటికి ఈ చిరుత నెలరోజుల వ్యవధిలోనే నలుగురిపై దాడి చెయ్యడంతో ఫారెస్ట్ అధికారులు సీరియస్‎గా తీసుకున్నారు. చిరుతపులిని పట్టుకోవడానికి ప్రత్యేక బోన్లను ఏర్పటు చెయ్యడంతో పాటు కెమరాలను ఏర్పాటు అమర్చారు. చిరుతను బంధించడానికి తీవ్ర ప్రయత్నాలు చేశారు. ఈ క్రమంలో పచ్చర్ల చెక్ పోస్ట్ వద్ద ఓ మేకను ఎరగా వేసి బోను ఏర్పాటు చేసారు. చిరుతపులి మేక కోసం బోనులోకి వచ్చి ఇరుక్కుపోయింది. నెలరోజుల పాటు గ్రామస్థులు, ఫారెస్ట్ అధికారులకు ముచ్చెమటలు పట్టించిన చిరుత బోనులో చిక్కుకోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. బోనులో చిక్కిన చిరుతకు మత్తుమందు ఇచ్చి ప్రత్యేక ఫారెస్ట్ వాహనంలో తిరుపతి జూ పార్క్‎కు తరలించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

భగవద్గీత శ్లోకాన్నిషేర్ చేసిన షోయబ్ అక్తర్..పాక్ ఫ్యాన్స్ గగ్లోలు
భగవద్గీత శ్లోకాన్నిషేర్ చేసిన షోయబ్ అక్తర్..పాక్ ఫ్యాన్స్ గగ్లోలు
సచిన్ వీరాభిమానికి అదిరిపోయే సర్ ప్రైజ్ ఇచ్చిన రోహిత్ శర్మ
సచిన్ వీరాభిమానికి అదిరిపోయే సర్ ప్రైజ్ ఇచ్చిన రోహిత్ శర్మ
వివో నుంచి అదిరిపోయే ట్యాబ్‌.. ఫీచర్స్‌ మాములుగా లేవు..
వివో నుంచి అదిరిపోయే ట్యాబ్‌.. ఫీచర్స్‌ మాములుగా లేవు..
ఆహాలో పార్వతీశం మార్కెట్ మహాలక్ష్మి.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆహాలో పార్వతీశం మార్కెట్ మహాలక్ష్మి.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
మల్టీస్టారర్‌లకు బూస్టప్ ఇచ్చిన నాగ్ అశ్విన్..
మల్టీస్టారర్‌లకు బూస్టప్ ఇచ్చిన నాగ్ అశ్విన్..
వండర్స్‌ క్రియేట్ చేయడంలో జక్కన్న అప్‌డేట్ అవ్వాలి
వండర్స్‌ క్రియేట్ చేయడంలో జక్కన్న అప్‌డేట్ అవ్వాలి
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై ప్రభుత్వం కీలక నిర్ణయం..
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై ప్రభుత్వం కీలక నిర్ణయం..
పాలనపై సీఎం రేవంత్‌రెడ్డి ఫోకస్‌.. కేబినెట్‌లో వారికే ఛాన్స్‌?
పాలనపై సీఎం రేవంత్‌రెడ్డి ఫోకస్‌.. కేబినెట్‌లో వారికే ఛాన్స్‌?
గర్భిణీలు చిన్న విషయానికే ఎందుకు చిరాకు పడతారో తెలుసా?
గర్భిణీలు చిన్న విషయానికే ఎందుకు చిరాకు పడతారో తెలుసా?
పురుషులకే ఇవే బ్రహ్మాస్త్రాలు.. వీటిని తిన్నారంటే..
పురుషులకే ఇవే బ్రహ్మాస్త్రాలు.. వీటిని తిన్నారంటే..