Pensions Distribution: ఏపీలో పెన్షన్ల పండగ.. అవ్వాతాతల ముఖాల్లో వెలుగులు

ఏపీలో ఇవాళ పండుగ వాతావరణం కనిపించింది. ఇంటికొచ్చిన పెన్షన్‌ డబ్బులతో.. అవ్వాతాతల ముఖాలు వెలిగిపోయాయి. పెరిగిన పెన్షన్‌ నేరుగా ఇంటికే రావడంతో.. లబ్దిదారులు ఫుల్‌ ఖుష్‌ అయ్యారు. ఒక్కరోజులోనే దాదాపుగా పెన్షన్‌ పంపిణీ కార్యక్రమాన్ని ఫినిష్‌ చేసింది ఏపీ సర్కార్. అయితే అధికారంలోకి రాగానే పెన్షన్లు పెంచుతామని హామీ ఇచ్చిన కూటమి సర్కార్‌.. ఆ హామీని పక్కాగా అమలు..

Pensions Distribution: ఏపీలో పెన్షన్ల పండగ.. అవ్వాతాతల ముఖాల్లో వెలుగులు
Pensions Distribution
Follow us

|

Updated on: Jul 01, 2024 | 8:53 PM

ఏపీలో ఇవాళ పండుగ వాతావరణం కనిపించింది. ఇంటికొచ్చిన పెన్షన్‌ డబ్బులతో.. అవ్వాతాతల ముఖాలు వెలిగిపోయాయి. పెరిగిన పెన్షన్‌ నేరుగా ఇంటికే రావడంతో.. లబ్దిదారులు ఫుల్‌ ఖుష్‌ అయ్యారు. ఒక్కరోజులోనే దాదాపుగా పెన్షన్‌ పంపిణీ కార్యక్రమాన్ని ఫినిష్‌ చేసింది ఏపీ సర్కార్. అయితే అధికారంలోకి రాగానే పెన్షన్లు పెంచుతామని హామీ ఇచ్చిన కూటమి సర్కార్‌.. ఆ హామీని పక్కాగా అమలు చేసింది. మూడు వేల రూపాయల ఫించన్‌ను నాలుగు వేలు చేస్తూ.. నేరుగా లబ్దిదారుల ఇళ్లకు వెళ్లి అందజేసింది. అంతేకాదు పెండింగ్‌లో ఉన్న ఫెన్షన్‌ను సైతం అవ్వతాతల చేతిలో పెట్టింది ఏపీ సర్కార్. రాష్ట్ర వ్యాప్తంగా ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, మంత్రుల చేతుల మీదుగా లబ్దిదారులకు పెన్షన్లను అందింది.

ఇది కూడా చదవండి: Credit Card Rules: ఈ బ్యాంకు క్రెడిట్‌ కార్డులు వాడుతున్నారా? కొత్త నిబంధనలు

ఉదయం 6 గంటల నుంచే రాష్ట్రవ్యాప్తంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం షురూ అయ్యింది. గుంటూరు జిల్లా మంగళగిరిలో పెన్షన్ల పంపిణీని ప్రారంభించారు ఏపీ సీఎం చంద్రబాబు. పెనుమాక ఎస్టీ కాలనీలో బానావత్ నాయక్‌ కుటుంబానికి మొదటి పెన్షన్ అందజేశారు. పూరి గుడిసెలో ఉంటున్న లబ్ధిదారుని ఇంటికి వెళ్లి నగదు అందించారు నయా సీఎం. పెన్షన్ల పంపిణీ కంటే ఆనందమైన రోజు తన జీవితంలో మరొకటి ఉండదంటూ ఫుల్‌ హ్యాపీగా ఫీలయ్యారు. ఇచ్చిన మాట ప్రకారం పెంచిన పెన్షన్లు అందజేశామన్నారు. అలాగే ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన 35 రూపాయల పెన్షన్‌ను ఇవాళ 4 వేల రూపాయలకు పెంచిన ఘనత తనకే దక్కుతుందన్నారు చంద్రబాబు.

ఇవి కూడా చదవండి

ఇటు కాకినాడ జిల్లా గొల్లప్రోలులో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్. లబ్ధిదారులకు పెన్షన్ల నగదుతో పాటు, సర్టిఫికెట్లను అందజేశారు. వాలంటీర్‌ వ్యవస్థ లేకుండానే పెన్షన్‌ పంపిణీ సాఫీగా సాగిందన్నారు. గతంలో నాలుగు రోజులపాటు ఇచ్చే పెన్షన్‌ ఇప్పుడు ఒక్కరోజులోనే దాదాపుగా పూర్తయ్యిందన్నారు. వాలంటీర్లకు ప్రత్యమ్నాయంగా ఎలాంటి ఉపాధి కల్పించాలన్న దానిపై ఆలోచిస్తామని పవన్‌ అనడం.. ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

ఇది కూడా చదవండి: RBI: రూ.2000 నోట్లపై ఆర్బీఐ కీలక ప్రకటన.. మార్కెట్లో రూ.7,581 కోట్ల నోట్లు!

ఎన్నికలప్పుడు వాలంటీర్‌ వ్యవస్థను రద్దు చేసే ప్రసక్తే లేదంటూ స్టేట్‌మెంట్‌ ఇచ్చారు చంద్రబాబు. అంతేకాదు అదనపు ఆదాయం వచ్చేలా చేస్తానంటూ వాలంటీర్లకు హామీ ఇచ్చారు. మరీ నేపథ్యంలో పెన్షన్ల పంపిణీకి వాలంటీర్లను వాడుకోకపోవడం.. వారికి ప్రత్యామ్నాయ ఉపాథి గురించి ఆలోచిస్తామని డిప్యూటీ సీఎం పవన్‌ మాట్లాడటం ఇప్పుడు కొత్త చర్చకు దారి తీసింది. వాలంటీర్లను ఏపీ ప్రభుత్వం ఎలా వాడుకుంటుంది..? అసలు కంటిన్యూ చేస్తుందా..? అన్న అనుమానాలూ కలుగుతున్నాయి. మొత్తంగా.. ఏపీలో ఇవాళ ఒక్కరోజే 95 శాతం పెన్షన్ల పంపిణీ పూర్తైంది. మిగిలిన 5 శాతం లబ్దిదారులకు మంగళవారం పెన్షన్‌ అందజేయనున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి