Bird Flu: చికెన్ తింటే ఇక అంతేనా? తెలుగు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ టెర్రర్.. డాక్టర్లు ఏం చెబుతున్నారు?

చికెన్ కర్రీస్‌ కాదు.. చికెన్‌ వర్రీసే ఇప్పుడు ట్రెండీ టాపిక్. చికెన్‌ తింటే అంతేనా..! గుడ్డు కూడా వెరీ బ్యాడా !! అనే భయాలే ఎటుచూసినా.. కోళ్లే కదా అని తేలిగ్గా తీసుకుంటే మన కిందకీ నీళ్లొచ్చేస్తాయి. ప్రజారోగ్యాలకు ప్రమాదాలు పొంచి ఉంటాయ్. బర్డ్‌ ఫ్లూ ఎంత లోతుల్లోకెళ్లి కెలికేస్తుందంటే.. లక్షలాది కోళ్లు మృత్యువాత పడి పౌల్ట్రీ రంగం కుదేలైపొయ్యి.. బ్రాండెడ్ చికెన్ కంపెనీల్లోనే వందలాది ఔట్‌లెట్లు మూసుకుపోయేంతలా.. అంత పెద్ద కేఎఫ్‌సీ వాళ్లే చికెన్ రేట్‌కార్డుల్ని మార్చుకునేంతలా..

Bird Flu: చికెన్ తింటే ఇక అంతేనా? తెలుగు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ టెర్రర్.. డాక్టర్లు ఏం చెబుతున్నారు?
Bird Flu

Updated on: Feb 12, 2025 | 9:55 PM

ఒక్కసారిగా తల వాచిపోతుంది.. కనురెప్పలు మూతబడతాయి.. తీవ్ర అలసటతో కదల్లేని పరిస్థితి. కనీసం కూత వెయ్యడానిక్కూడా శక్తి ఉండదు. ఒక్కటొక్కటిగా ఈకలు పెకలించుకుపోతాయ్. కానీ.. బాధను పైకి చెప్పుకోలేని మూగజీవాలు..! ఏవియన్ ఫ్లూ.. కోళ్ల అరోగ్యాన్ని ఎంత తీవ్రంగా దెబ్బతీస్తుందంటే ఒక్కోసారి గంటల్లోనే ప్రాణం పోవచ్చు. అవి పెట్టే గుడ్లు కూడా షేపులు మారిపోయి.. పైపెంకు లేకుండా ఉంటాయి. ఇవన్నీ నిశితంగా పరిశీలిస్తే తప్ప తెలీదు.. ఆ కోళ్లకు ఫ్లూ సోకిందని. మరి.. కోళ్లనుంచి మనకు సోకితే.. బర్డ్‌ఫ్లూతో మనిషికి ఎంత ముప్పు..? చికెన్ కర్రీస్‌ కాదు.. చికెన్‌ వర్రీసే ఇప్పుడు ట్రెండీ టాపిక్. చికెన్‌ తింటే అంతేనా..! గుడ్డు కూడా వెరీ బ్యాడా !! అనే భయాలే ఎటుచూసినా.. కోళ్లే కదా అని తేలిగ్గా తీసుకుంటే మన కిందకీ నీళ్లొచ్చేస్తాయి. ప్రజారోగ్యాలకు ప్రమాదాలు పొంచి ఉంటాయ్. బర్డ్‌ ఫ్లూ ఎంత లోతుల్లోకెళ్లి కెలికేస్తుందంటే.. లక్షలాది కోళ్లు మృత్యువాత పడి పౌల్ట్రీ రంగం కుదేలైపొయ్యి.. బ్రాండెడ్ చికెన్ కంపెనీల్లోనే వందలాది ఔట్‌లెట్లు మూసుకుపోయేంతలా.. అంత పెద్ద కేఎఫ్‌సీ వాళ్లే చికెన్ రేట్‌కార్డుల్ని మార్చుకునేంతలా.. చివరికి.. పెళ్లిళ్ల డిన్నర్ మెనూల్లో సడన్‌గా కనిపించకుండా పోయేంతలా.. తెలుగురాష్ట్రాల బార్డర్‌లో టెన్షన్లు పుట్టించేంతలా.. అమెరికా హెల్త్ ఎమర్జెన్సీ విధించేంతలా.. వరల్డ్‌ హెల్త్ ఆర్గనేజేషనే చేతులెత్తేసేంత సీరియస్‌గా మారబోతోంది సిట్యువేషన్.. ఏవియన్ ఇన్‌ఫ్లుయెంజా.. కోళ్లకు, వాటి ద్వారా మనుషులకు వ్యాపించే ప్రాణాంతకమైన బర్డ్‌ఫ్లూ వైరస్.. తొలిసారిగా ఇండియాలో 2006లో మహారాష్ట్రలోని నవాపూర్...

పూర్తి కథనాన్ని చదివేందుకు TV9 యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

ప్రత్యేకమైన కథనాలకు అపరిమితమైన యాక్సెస్ TV9 యాప్‌లో కొనసాగండి