AP Politics: బాబు డ్రీమ్‌ టీమ్‌… చంద్రబాబులో కనిపించిన మార్పేంటి?

|

Jun 14, 2024 | 7:10 PM

ఏపీలో మంత్రులకు శాఖల కేటాయింపు పూర్తయ్యింది. మంత్రివర్గ కూర్పులోనే కాదు.. ఇప్పుడు శాఖల కేటాయింపులోనూ చంద్రబాబు తన చాణక్యాన్ని కనబరిచినట్టు స్పష్టంగా తెలుస్తోంది. ఇకమీదట మారిన చంద్రబాబును చూస్తారంటూ ఆయన చెప్పిన మాట.. మాటవరసకు అనలేదని నిరూపించారు. సీనియారిటీ సీనియారిటీనే… బట్‌ తన ప్రయారిటీస్‌ కూడా ఇంపార్టెంట్‌ అన్నట్టుగా చంద్రబాబు శాఖల కేటాయింపు జరపడం విశేషం. ఏపీ రాజకీయాల్లో ఇప్పుడిదే హాట్‌ డిబేటబుల్‌ పాయింట్‌గా మారింది.

AP Politics: బాబు డ్రీమ్‌ టీమ్‌... చంద్రబాబులో కనిపించిన మార్పేంటి?
Big News Big Debate
Follow us on

ఏపీలో కొలువుదీరిన కొత్త ప్రభుత్వంలో.. ఏ మంత్రికి ఏ బాధ్యతలనే విషయంలో క్లారిటీ వచ్చేసింది. తన టీమ్‌ను ఎలా అనుకున్నారో.. అలాగే సెట్‌ చేసుకున్నారు చంద్రబాబు. అనుభవం, ప్రావీణ్యం అనే కొలమానంలో… తన టీమ్‌ మెంబర్స్‌కి శాఖలను కేటాయించారు. సీనియార్టీని గౌరవిస్తూనే.. కొత్తవారిని ఎంకరేజ్‌ చేశారు.

మంత్రివర్గంలో దాదాపు సగంమంది తొలిసారి కేబినెట్‌లోకి వచ్చినవారే కావడం విశేషం. డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ మొదలు.. టీజీ భరత్‌ దాకా… వారివారి ప్రావీణ్యాన్ని బట్టి, ఉత్సాహాన్ని పరిగణనలోకి తీసుకుని.. బాధ్యతలు కట్టబెట్టారు చంద్రబాబు. ఇందులోనే సామాజిక సమీకరణలు కూడా కలిసొచ్చేలా చూసుకున్నారు.

తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన పవన్‌ కల్యాణ్‌కు.. కీలకమైన పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖే కాదు… సైన్స్ అండ్‌ టెక్నాలజీ బాధ్యతలనూ అప్పగించారు. ఆ జోనర్‌లో పవన్‌కు ఉన్న ఇంట్రస్ట్‌ను చంద్రబాబు పరిగణనలోకి తీసుకున్నారు. తొలిసారిగా మంత్రులైన వంగలపూడి అనితకు కీలకమైన హోంశాఖ, ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడికి నీటి పారుదలశాఖ.. అప్పగించడంలోనూ చంద్రబాబుకు స్పష్టమైన క్లారిటీ ఉందని తెలుస్తోంది.

సీనియర్‌ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌ కు కూడా అమాత్యయోగం తొలిసారే అయినా.. గతంలో పీఏసీ చైర్మన్‌గా ఆర్థిక లావాదేవీలపై ఆయనకు మంచి పట్టుందని గుర్తించారు. అందుకే ఆర్థికశాఖను ఇచ్చారు. ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ మీద గట్టిగా పోరాటం చేసిన అనగాని సత్యప్రసాద్‌ను రెవెన్యూ మంత్రిగా.. ఇండస్ట్రియలిస్ట్‌గా అనుభవమున్న టీజీ భరత్‌ను భారీపరిశ్రమలశాఖ మంత్రిగా ఎంపిక చేయడంలోనూ చంద్రబాబు చాణక్యం సుస్పష్టం.

తొలిసారిగా ఎమ్మెల్యేలయిన వారికి కూడా తన కేబినెట్‌లో ఛాన్సిచ్చిన చంద్రబాబు.. కొత్త తరానికి ప్రయార్టీ ఇస్తున్నాననే చెప్పకనే చెప్పారు. అంతేకాదు, ఏ కోణంలో చూసినా సమతూకం పాటించారనేలా.. శాఖల కేటాయింపు జరిపారు. మరి, కీలకమైన పోలవరం, అమరావతి, సంక్షేమం అనే చంద్రబాబు ఎజెండా కు ఈ కూర్పులు, కేటాయింపులు ఎంతవరకు న్యాయం చేస్తాయో చూడాలి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…