Andhra Pradesh: నంద్యాలలో టెన్షన్ టెన్షన్.. భూమా అఖిల ప్రియను హౌస్ అరెస్ట్..

|

Feb 04, 2023 | 9:24 AM

నంద్యాలలో టెన్షన్ కొనసాగుతోంది. ఆళ్లగడ్డ సవాళ్లకు అడ్డాగా మారింది. భూమా - శిల్పా కుటుంబాల మధ్య వార్ పీక్ స్టేజికి చేరింది. భూమా కుటుంబంపై చేసిన అవినీతి అరోపణలతో పాటు

Andhra Pradesh: నంద్యాలలో టెన్షన్ టెన్షన్.. భూమా అఖిల ప్రియను హౌస్ అరెస్ట్..
Bhuma Akhila Priya Challenge To Ycp Mla Shilpa Ravi In This Video
Follow us on

నంద్యాలలో టెన్షన్ కొనసాగుతోంది. ఆళ్లగడ్డ సవాళ్లకు అడ్డాగా మారింది. భూమా – శిల్పా కుటుంబాల మధ్య వార్ పీక్ స్టేజికి చేరింది. భూమా కుటుంబంపై చేసిన అవినీతి అరోపణలతో పాటు అభివృద్ధిపై దమ్ముంటే చర్చకు రావాలంటూ ఎమ్మెల్యే శిల్పా రవికి.. టీడీపీ నేత, మాజీ మంత్రి భూమా అఖిలప్రియ సవాల్ చేయడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

ముందస్తు చర్యల్లో భాగంగా.. ఆళ్లగడ్డలోని తన ఇంటిలో భూమా అఖిల ప్రియను హౌస్ అరెస్ట్ చేశారు. ఆమె ఇంటి నుంచి బయటకు రాకుండా 30 మందికి పైగా పోలీసులు పహారా కాస్తున్నారు.

నీ ప్రతాపం ఏంటో నాప్రతాపం ఏంటో చూసుకుందాం.. పార్టీకి రాజీనామా చేసి రా.. ప్రజల్లోనే తేల్చుకుందాం అంటూ భూమా అఖిలప్రియ సవాల్ చేశారు. ఇవాళ సాయంత్రం నాలుగు గంటలకు నంద్యాలలోని గాంధీ చౌక్ దగ్గర చర్చకు రావాలని.. నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవికి అఖిల ప్రియ సవాల్ చేశారు. ఎట్టి పరిస్థితుల్లో గాంధీ చౌక్ వెళ్తానని అఖిలప్రియ నిర్ణయించుకోవడంతో.. నంద్యాలలో 30యాక్ట్ అమలు చేస్తున్నారు పోలీసులు. నగర పరిధిలో ఎలాంటి సభలు, సమావేశాలను అనుమతి లేదన్నారు. ఇందులో భాగంగానే అఖిల ప్రియను హౌస్ అరెస్ట్ చేశారు. దానిని ఖండిస్తూ పోలీసులపై మండిపడుతున్నారు అఖిలప్రియ. ఈ మేరకు నిన్ననే గాంధీ చౌక్‌ను పరిశీలించారు.

ఇవి కూడా చదవండి

అయితే ఆడవాళ్ళతో కయ్యానికి దిగే సంస్కృతి తనకు లేదని, చర్చకు రాబోనని నిన్ననే ప్రకటించారు ఎమ్మెల్యే శిల్పా రవి. ఓటేసి గెలిపించిన నంద్యాల ప్రజలకు మాత్రమే సమాధానం చెప్తా అన్నారు శిల్పా రవి.

ఇటీవల ఓ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే శిల్పా రవి.. భూమా కుటుంబంపై కొన్ని కామెంట్లు చేశారు. ఇక్కడే అఖిల ప్రియకు మండిపోయింది. మా కుటుంబాన్ని ఇంత మాటంటావా.. నీకెంత ధైర్యం అనే రేంజ్‌లో ఫైర్ అయ్యారు. దీంతో ఇవాళ ఏం జరుగుతుందో అనే ఉత్కంఠ కొనసాగుతోంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..